Navdeep : ట్రైలర్‌లోనే ఏడు ముద్దులు.. సినిమాలో ఏకంగా అన్ని.. అర్జున్ రెడ్డి రికార్డ్ బ్రేక్ చేయబోతున్న నవదీప్..

తాజాగా సెన్సార్ అవ్వగా సెన్సార్ బోర్డు సమాచారం ప్రకారం ఈ సినిమాలో భారీగా ముద్దు సీన్లు ఉన్నట్టు తెలుస్తుంది.

Navdeep : ట్రైలర్‌లోనే ఏడు ముద్దులు.. సినిమాలో ఏకంగా అన్ని.. అర్జున్ రెడ్డి రికార్డ్ బ్రేక్ చేయబోతున్న నవదీప్..

Navdeep Breaks Arjun Reddy Movie Record with Love Mouli Movie

Updated On : June 2, 2024 / 6:35 PM IST

Navdeep Love Mouli : నవదీప్ కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ హీరోగా ‘లవ్ మౌళి’ సినిమాతో రాబోతున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో C స్పేస్, నైరా క్రియేషన్స్ నిర్మాణంలో అవనీంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నవదీప్ ఈ సినిమాతో రెండో వర్షన్ తో వస్తున్నాను అని, ఇది తన సెకండ్ ఇన్నింగ్స్ అని ప్రమోట్ చేస్తున్నాడు. ఆల్రెడీ లవ్ మౌళి సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా జూన్ 7న రిలీజ్ కానుంది.

ఈ సినిమాలో నవదీప్ ఓ పెయింటర్ అని, తనకు కావాల్సిన అమ్మాయి, తనకు కావాల్సిన ప్రేమ కోసం పలువురు అమ్మాయిలతో ట్రావెల్ చేస్తాడని తెలుస్తుంది. అయితే ట్రైలర్ లోనే కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి. దీంతో సినిమాలో కూడా చాలా బోల్డ్ సీన్స్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. లిప్ కిస్ లు మాత్రమే కాక ఎక్స్‌పోజింగ్, మరిన్ని రొమాంటిక్ సీన్స్ లవ్ మౌళి సినిమాలో చాలానే ఉన్నట్టు సమాచారం. లవ్ మౌళి ట్రైలర్ లోనే ఏడు లిప్ కిస్ సీన్లు ఉన్నాయి. తాజాగా సెన్సార్ అవ్వగా సెన్సార్ బోర్డు సమాచారం ప్రకారం ఈ సినిమాలో భారీగా ముద్దు సీన్లు ఉన్నట్టు తెలుస్తుంది.

Also Read : NTR 31 : ఎన్టీఆర్ సినిమా ఏకంగా అన్ని దేశాల్లో షూటింగ్.. ప్రశాంత్ నీల్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడుగా..

తాజా సమాచారం ప్రకారం లవ్ మౌళి సినిమాలో ఏకంగా 42 లిప్ కిస్ సీన్స్ ఉన్నాయని సమాచారం. ఈ విషయం తెలిసి సినీ పరిశ్రమ వ్యక్తులు కూడా ఆశ్చర్యపోతున్నారు. 42 లిప్ కిస్ లు ఏంటి బ్రో అంటూ నెటిజన్లు కూడా నవదీప్ పై సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో అర్జున్ రెడ్డి సినిమాలో 25 కు పైగా లిప్ కిస్ సీన్స్ ఉన్నాయి. ఇప్పుడు నవదీప్ లవ్ మౌళి సినిమాలో ఏకంగా 42 ముద్దు సీన్స్ తో అర్జున్ రెడ్డి రికార్డ్ బ్రేక్ చేస్తాడని అంటున్నారు. ఇందులో నవదీప్ న్యూడ్ గా కూడా నటించడం గమనార్హం. ఈ లవ్ మౌళి సినిమాకు ఆల్రెడీ A సర్టిఫికెట్ ఇచ్చారు. మరి లవ్ మౌళి సినిమాతో నవదీప్ ఏ రేంజ్ లో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తాడో చూడాలి.