Naveen Chandra : ‘గేమ్ ఛేంజర్’ సినిమా వల్ల.. ఆ పెద్ద సినిమాలో మెయిన్ విలన్ ఛాన్స్ మిస్ అయింది.. బాధపడుతున్న హీరో..
తాజాగా నేడు నవీన్ చంద్ర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి, తన ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు.

Naveen Chandra Miss Villain Chance in Tamil Movie Due to Ram Charan Game Changer
Naveen Chandra : తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉన్నాడు నవీన్ చంద్ర. ఆయన హీరోగా నటించిన “28°C” సినిమా ఏప్రిల్ 4న రిలీజ్ అవ్వనుంది. ఎమోషనల్ థ్రిల్లర్ లవ్ స్టోరీతో ఈ సినిమాని పొలిమేర డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించాడు. ఇది డైరెక్టర్ మొదటి సినిమా అయినా పలు కారణాలతో ఆలస్యంగా రిలీజ్ అవుతుంది.
తాజాగా నేడు నవీన్ చంద్ర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి, తన ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో గేమ్ ఛేంజర్ సినిమా వల్ల ఓ సినిమా ఛాన్స్ వదులుకోవాల్సి వచ్చింది అని తెలిపాడు.
నవీన్ చంద్ర మాట్లాడుతూ.. తమిళ్ లో కూడా నాకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్, హీరోగా ఆఫర్స్ వస్తున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాకు చాలా డేట్స్ ఇచ్చాను. గేమ్ ఛేంజర్ సినిమాలో ఉన్నప్పుడు సూర్య రెట్రో సినిమా ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో విలన్ పాత్ర ఆఫర్ చేసారు. కానీ గేమ్ ఛేంజర్ లో ఉండటం వల్ల దానికి డేట్స్ ఇవ్వలేకపోయాను అని తెలిపాడు. సూర్య రెట్రో సినిమాలో ఛాన్స్ మిస్ అయినందుకు బాధగానే ఉందన్నాడు నవీన్ చంద్ర. అయినా శంకర్ మరోసారి అడిగినా ఆయనతో సినిమా చేస్తాను అని చెప్పాడు.
గతంలో ప్రియదర్శి కూడా గేమ్ ఛేంజర్ సినిమాలో చాలా డేట్స్ వర్క్ చేశాను కానీ స్క్రీన్ మీద 2 నిముషాలు కూడా కనపడని అని అన్నారు. చాలా మంది ఆర్టిస్టులు ఇదే భావం వ్యక్తం చేసారు. ఇప్పుడు నవీన్ చంద్ర కూడా గేమ్ ఛేంజర్ వల్ల తమిళ్ లో స్టార్ హీరో సినిమాలో మెయిన్ విలన్ ఛాన్స్ మిస్ అవ్వడంపై బాధపడుతున్నాడు.