Vishnu : ‘మ్యాడ్’ సినిమాల్లో ఫుల్ గా నవ్వించిన లడ్డు.. ఎవరో తెలుసా? విజయ్ దేవరకొండకు బాగా క్లోజ్.. అప్పట్నుంచే సినిమాల్లో..
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాల్లో ఫుల్ గా నవ్వించిన పాత్రల్లో లడ్డు పాత్ర ఒకటి. ఈ లడ్డు పాత్రలో నటుడు విష్ణు అందర్నీ పడీ పడీ నవ్వించాడు.

Do You Know about Mad Actor Vishnu OI Close to Vijay Deverakonda Here Details
Vishnu : నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్, విష్ణు.. పలువురు ముఖ్య పాత్రల్లో వచ్చిన మ్యాడ్, మ్యాడ్ సీక్వెల్ సినిమాలు పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. రెండు సినిమాలు ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించాయి. మ్యాడ్ స్క్వేర్ ఇటీవలే మార్చ్ 28న రిలీజయి ఇప్పటికే 75 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాల్లో ఫుల్ గా నవ్వించిన పాత్రల్లో లడ్డు పాత్ర ఒకటి. ఈ లడ్డు పాత్రలో నటుడు విష్ణు అందర్నీ పడీ పడీ నవ్వించాడు. రెండు సినిమాల్లోనూ ఇతని పాత్ర బాగా వర్కౌట్ అయింది. అయితే ఇతను ఎప్పట్నుంచో సినిమాల్లో ఉన్నాడు. విష్ణు కూడా విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్, రాహుల్ రామకృష్ణ బ్యాచ్. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన సైన్మా షార్ట్ ఫిలిం లో కూడా నటించాడు విష్ణు.
Also Read : Ashu Reddy : అతను చనిపోయాకే సీరియస్ గా లవ్ చేసాడని అర్ధమయింది.. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి.. అషురెడ్డి ఎమోషనల్..
విష్ణు విజయ్ దేవరకొండ చదివిన డిగ్రీ కాలేజీలో విజయ్ కి సబ్ జూనియర్. ఈ విషయాన్ని విజయ్ ట్యాక్సీ వాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పాడు. విష్ణు మొదట్లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. ట్యాక్సీవాలా సినిమాతో నటుడిగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రామన్న యూత్, మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, కీడా కోలా, హ్యాపీ ఎండింగ్, సరిపోదా శనివారం, డార్లింగ్, మా నాన్న సూపర్ హీరో.. ఇలా అనేక సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నవ్విస్తూ వస్తున్నాడు. మ్యాడ్ సినిమాకు బెస్ట్ కమెడియన్ గా ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు.
విష్ణు మంచి ఫోటోగ్రాఫర్ కూడా. తన సోషల్ మీడియాలో తను తీసిన ఫోటోలు అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాడు. డిగ్రీ చదువుతున్నప్పటి నంచి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్ తో ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు బిజీ కమెడియన్ గా మారాడు.
Also See : Anasuya Bharadwaj : చీరలో బ్యాక్ లెస్ ఫోజులతో.. అనసూయ హాట్ ఫోటోలు వైరల్..
ట్యాక్సీవాలా సినిమాలో విష్ణు ఓ పాత్రలో నటించాడు. ట్యాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ విష్ణు గురించి మాట్లాడుతూ.. ఇతని పేరు విష్ణు. నా కాలేజీలో సబ్ జూనియర్. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ఇతను డిగ్రీ ఫస్ట్ ఇయర్. అప్పుడు లైఫ్ లో ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉండేవాడిని. అప్పటికే ఇతను ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలింస్ తో బిజీగా ఉండేవాడు. చాలా ట్యాలెంటెడ్ ఫోటోగ్రాఫర్. బయట చాలా నవ్వించేవాడు. నా ఫ్రెండ్ అయ్యాడు. నేను యాక్టర్ అయ్యాక విష్ణు ఈ సినిమాలో ఒక రోల్ కి పర్ఫెక్ట్ సెట్ అవుతాడు అనిపించి తీసుకొచ్చాను. ఈ సినిమాలో హాలీవుడ్ అనే రోల్ చేసాడు. లైఫ్ లో బాగా సెటిల్ అవుతాడు అని చెప్పుకొచ్చాడు. అప్పుడే విజయ్ దేవరకొండ విష్ణు గురించి ఓ రేంజ్ లో చెప్పాడు. విజయ్ చెప్పినట్టే విష్ణు సినిమాల్లో దూసుకుపోతున్నాడు.