Naveen Polishetty: హీరో అవ్వాలంటే గొప్పవాడు కానక్కర్లేదు.. నవీన్ పోలిశెట్టి ఎమోషనల్ ట్వీట్!

నవీన్ పోలిశెట్టి.. ఇండస్ట్రీకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా నిలదొక్కుకుంటున్న వ్యక్తి. కెరీర్ మొదటిలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేసిన నవీన్, టాలీవుడ్ తో పాటు బాలీవూడ్ సినిమాలోనూ నటించాడు. ఫుల్ కామెడీ టైమింగ్ ఉన్న నవీన్ కి జాతిరత్నాలు వంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా పడితే, ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో జాతిరత్నాలు కలెక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది. కాగా ఇటీవల జరిగిన SIIMA అవార్డ్స్ ప్రధానోత్సవంలో హీరో నవీన్ ఈ సినిమాకు గాను క్రిటిక్స్ తెలుగు బెస్ట్ యాక్టర్ అవార్డు ను అందుకున్నాడు.

Naveen Polishetty: హీరో అవ్వాలంటే గొప్పవాడు కానక్కర్లేదు.. నవీన్ పోలిశెట్టి ఎమోషనల్ ట్వీట్!

Naveen Polishetty Emotional Tweet for Winning his First Best Actor Award

Updated On : September 18, 2022 / 3:40 PM IST

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి.. ఇండస్ట్రీకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా నిలదొక్కుకుంటున్న వ్యక్తి. కెరీర్ మొదటిలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేసిన నవీన్, టాలీవుడ్ తో పాటు బాలీవూడ్ సినిమాలోనూ నటించాడు. నటుడి గానే కాదు కొన్ని సినిమాలకు స్క్రీన్ రైటర్ గా కూడా పని చేశాడు. ఇక “ఏజెంట్ సాయి శ్రీనివాస్” సినిమాతో హీరోగా మారిన నవీన్ పోలిశెట్టి, మొదటి సినిమాతోనే మంచి సాలిడ్ హిట్ ని అందుకున్నాడు.

Naveen Polishetty : వరుస సినిమాలతో బిజీగా మారిన నవీన్ పోలిశెట్టి..

ఫుల్ కామెడీ టైమింగ్ ఉన్న నవీన్ కి జాతిరత్నాలు వంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా పడితే, ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో జాతిరత్నాలు కలెక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది. కాగా ఇటీవల జరిగిన SIIMA అవార్డ్స్ ప్రధానోత్సవంలో హీరో నవీన్ ఈ సినిమాకు గాను క్రిటిక్స్ తెలుగు బెస్ట్ యాక్టర్ అవార్డు ను అందుకున్నాడు.

ఈ అవార్డుని అందుకున్న ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఒక ఎమోషనల్ ట్వీట్ చేశాడు.. “సినిమా హీరో అవ్వడం వంటి గొప్ప కలలు కనడానికి మనం గొప్పవాలం కాదు అని, చిన్నప్పుడు నాకు ఎప్పుడూ చెప్పేవారు. ఈరోజు ఆ కుర్రాడే ఉత్తమ నటుడి అవార్డుని అందుకున్నాడు. ఆకలిని, కష్టాలను ఎదురుకొని రాత్రి పగలు కష్టపడితే.. కలలు తప్పకుండ నిజమవుతాయి” అంటూ ఆ అవార్డుని ప్రతిఒక్క కామన్ మ్యాన్ కి అంకితం చేశాడు.