Therachaapa : ‘తెరచాప’ టీజర్ చూశారా?
హీరో కార్తీక్ రత్నం, హరికథ దర్శకుడు మ్యాగీ చేతుల మీదగా ఈ టీజర్ లాంచ్ చేశారు.

Naveenraj Rajiv Kanakala Therachaapa Teaser Released
Therachaapa : నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న సినిమా తెరచాప. అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాణంలో జోయల్ జార్జ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, నాగ మహేష్, ఫిష్ వెంకట్, నాగి, అప్పారావు, రైజింగ్ రాజు.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. హీరో కార్తీక్ రత్నం, హరికథ దర్శకుడు మ్యాగీ చేతుల మీదగా ఈ టీజర్ లాంచ్ చేశారు. మీరు కూడా తెరచాప టీజర్ చూసేయండి..
తెరచాప టీజర్ లాంచ్ ఈవెంట్లో నటుడు 30 ఇయర్స్ పృద్వి మాట్లాడుతూ.. నవీన్ ని చూస్తుంటే తమిళ హీరో విక్రమ్ గుర్తొస్తున్నాడు. ఆయన సినిమా కోసం ఎంత కష్టపడతాడో నవీన్ కూడా అంతే కష్టపడుతున్నాడు. రాత్రి పగలు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నవీన్ ఈ సినిమా కోసం కష్టపడి ఆసుపత్రి పాలు కూడా అయ్యాడంటే అర్ధం చేసుకోండి. అతని కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
డైరెక్టర్ జోయెల్ జార్జ్ మాట్లాడుతూ.. ఈ సినిమాని మంచి మాస్ సినిమాగా తీసాం. ఇందులో కొంచెం తమిళ నేపథ్యం కూడా ఉంటుంది. ఈ సినిమా కోసం మా నటులు, టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు. మంచి ఔట్ పుట్ వచ్చింది అని అన్నారు. నిర్మాత కైలాష్ దుర్గం మాట్లాడుతూ.. నాకు సినిమా రంగంలో ఇదే ఫస్ట్ టైం. ఈ సినిమా మీద నాకు నమ్మకం ఉంది. కచ్చితంగా హిట్ కొడతాం అని అన్నారు.
హీరో నవీన్ మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో ఈ సినిమా మీద 3 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవ్వాలి అని అన్నారు. హీరో కార్తీక్ రత్నం మాట్లాడుతూ… తెరచాప చిత్ర టీజర్ చాలా బాగుంది. నాకు లేటుగా తెలిసినా నవీన్ కోసం ఇక్కడికి వచ్చాను. నవీన్ రాజ్ కు నేను సపోర్ట్ గా నిలుస్తాను అని తెలిపారు.