Nayanthara – Dhanush : మరో పోస్ట్ చేసిన నయనతార.. వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్పి ఇండైరెక్ట్ గా ధనుష్ కి కౌంటర్..
తాజాగా నయనతార తన సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టింది.

Nayanathara Post in Social Media looks like Counter to Dhanush
Nayanthara – Dhanush : గత కొన్ని రోజులుగా నయనతార – ధనుష్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల నయనతార లైఫ్ పై నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ చేసింది. అయితే ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా చేసిన సినిమాలోని సన్నివేశాలను, వర్కింగ్ వీడియోలను పర్మిషన్ లేకుండా వాడుకున్నందుకు ధనుష్ నయనతారకు 10 కోట్లు కట్టమని లీగల్ నోటిస్ పంపాడు. దీనికి నయనతార ఫైర్ అవుతూ ధనుష్ పై తీవ్ర విమర్శలు చేస్తూ, 3 సెకండ్స్ కి పది కోట్లు కట్టాలా, నువ్వు ఎలాంటివాడివో మీ ఫ్యాన్స్ కి తెలీదు, నిన్ను రెండేళ్లుగా పర్మిషన్ అడిగితే ఇవ్వట్లేదు అంటూ పబ్లిక్ గా సంచలన పోస్ట్ చేసింది. దీంతో ఇది తమిళ పరిశ్రమలో వివాదంగా మారింది.
అయితే దీనికి ధనుష్ మాత్రం స్పందించలేదు. ఇక డాక్యుమెంటరీ రిలీజ్ అయ్యాక అందులో ఆల్మోస్ట్ 30 సెకండ్స్ దాకా ధనుష్ కి సంబంధించిన కంటెంట్ ఉండటంతో అందరూ ధనుష్ ని సపోర్ట్ చేస్తున్నారు. నయన్ అబద్దం చెప్పిందని, ధనుష్ డబ్బులు అడగడంలో తప్పులేదు, నయన్ మాత్రం తన పెళ్లిని డబ్బులకు అమ్ముకోవచ్చు కానీ ధనుష్ అడగకూడదా అంటూ నయన్ పై విమర్శలు చేస్తూ ధనుష్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.
Also Read : Nikhil : నాకు ఓటు వేయకండి.. నన్ను ఎలిమినేట్ చేయండి.. బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతా అంటున్న నిఖిల్.. కానీ..
అయితే తాజాగా నయనతార తన సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టింది. తన డాక్యుమెంటరీలో తాను చేసిన చాలా సినిమాల నుంచి కంటెంట్ వాడనుకున్నాను అని, అందుకు ఆ సినిమాల నిర్మాతలు, వాటికి సంబంధించిన వారికి సంప్రదించి వారి దగ్గర్నుంచి NOC ఫామ్ తీసుకొని ఆ కంటెంట్ వాడాను అని తెలిపింది. అలాగే నేను అడగ్గానే వారంతా ఎలాంటి ఇబ్బంది ఫీల్ అవ్వకుండా అందరూ వెంటనే ఒప్పుకున్నారు. ఇందుకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు అంటూ బాలీవుడ్, టాలీవుడ్, తమిళ పరిశ్రమ, మలయాళ పరిశ్రమలో తనకు కంటెంట్ వాడుకోడానికి అనుమతులు ఇచ్చిన నిర్మాతలందరి పేర్లు కూడా ప్రస్తావిస్తూ ధన్యవాదాలు తెలియచేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. వాళ్ళందరూ పర్మిషన్ ఇచ్చినా ఒక్క ధనుష్ మాత్రమే పర్మిషన్ ఇవ్వలేదు అని ఇండైరెక్ట్ గా నయన్ కౌంటర్ ఇచ్చిందా అని చర్చగా మారింది.