Nikhil : నాకు ఓటు వేయకండి.. నన్ను ఎలిమినేట్ చేయండి.. బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతా అంటున్న నిఖిల్.. కానీ..
తాజాగా నిన్నటి ఎపిసోడ్ లో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

Nikhil Wants To Quit from Bigg Boss due to her comments
Bigg Boss Nikhil : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకొని 11వ వారం జరుగుతుంది. ఇప్పటికే 12 మంది ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లో ఇంకో 10 మంది ఉన్నారు. అయితే ఈసారి కప్పు గెలుస్తారు అనుకునే వాళ్ళల్లో నిఖిల్ కూడా ఉన్నాడు. నటుడు నిఖిల్ మొదటి వారం నుంచి ఫుల్ ఫైర్ లోనే ఉన్నాడు. మధ్యలో కాస్త డీలా పడిన నిఖిల్ మళ్ళీ పుంజుకున్నాడు.
అయితే తాజాగా నిన్నటి ఎపిసోడ్ లో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. కిరాక్ సీత నిఖిల్ ని ఉద్దేశించి ఆడవాళ్లను ట్రాప్ చేస్తున్నావ్, ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నావ్ అని అనడంతో నిఖిల్ తో పాటు అంతా షాక్ అయ్యారు. దీంతో యష్మి వచ్చి నా వల్లే ఇలా నిన్ను అంటున్నారు అని సారీ చెప్పింది.
Also Read : Silpa Ravi Chandra Reddy : అల్లు అర్జున్ పుష్ప 2 కోసం స్పెషల్ పోస్ట్ చేసిన బన్నీ ఫ్రెండ్, వైసీపీ నేత..
దీంతో నిఖిల్ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేనెప్పుడూ ఒకర్ని తొక్కి ఆడాలనుకోలేదు. సీత చెప్పినట్టు నేనేమి స్ట్రాంగ్ మహిళల్ని అడ్డుపెట్టుకొని గెలవాలనుకోవట్లేదు. నాకు ఏమి అనిపిస్తే అది చేశాను. ఈ వారం నామినేషన్స్ లో ఉన్నాను. నాకు వెళ్లిపోవాలనిపిస్తుంది. ప్రేక్షకులు నాకు ఓట్ వెయ్యకండి, నన్ను ఎలిమినేట్ చెయ్యండి అని అన్నాడు. అయితే అంతలోనే మళ్ళీ కాసేపటికి కెమెరాల ముందుకు వచ్చి.. నేనేంటో నిరూపించుకుంటాను. కప్పు తీసుకొనే వస్తాను. వెళ్ళిపోతాను అన్నందుకు క్షమించండి. నన్ను తప్పు అని అన్నచోటే నేనేంటో నిరూపించుకుంటాను అని అన్నాడు. మరి ఈ సీజన్ లో నిఖిల్ కప్పు గెలుస్తాడేమో చూడాలి.