యమున-భవానీగా నయనతార

ఐరా సినిమా చూసిన సెన్సార్ టీమ్, యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.

  • Published By: sekhar ,Published On : February 16, 2019 / 11:54 AM IST
యమున-భవానీగా నయనతార

Updated On : February 16, 2019 / 11:54 AM IST

ఐరా సినిమా చూసిన సెన్సార్ టీమ్, యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.

లేడీ సూపర్ స్టార్ నయనతార మొయిన్ లీడ్‌గా, తమిళ్, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్నసినిమా, ఐరా.. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఐరా తెలుగు, తమిళ్ టీజర్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఐరా సెన్సార్ కంప్లీట్ అయ్యింది. సినిమా చూసిన సెన్సార్ టీమ్, యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. నయనతార ఈ సినిమాలో యమున, భవానీ అనే రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుంది. పల్లెటూరి గృహిణిగా, మోడరన్ యువతిగా కనిపించినుంది. ప్రస్తుతం పొస్ట్‌ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.. మార్చిలో ఐరా రిలీజ్ కానుంది.

కలైయరసన్, యోగిబాబు తదితరులు నటిస్తున్నఈ సినిమాకి సంగీతం : సుందరమూర్తి కె.ఎస్. కెమెరా : సుదర్శన్ శ్రీనివాసన్, ఎడిటింగ్ : కార్తీక్ జోగేష్, కథ, స్ర్కీన్ ప్లే : ప్రియాంక రవీంద్రన్, డైలాగ్స్ : శశాంక్ వెన్నెలకంటి, ఫైట్స్ : మిరాకిల్ మైఖేల్ రాజ్, దర్శకత్వం : సర్జున్ కెఎమ్.

వాచ్ ఐరా టీజర్…