Nayanthara: స్పెషల్ ప్రీమియర్స్‌తో ‘కనెక్ట్’ అవుతానంటోన్న నయన్!
సౌట్ ఇండస్ట్రీ స్టార్ బ్యూటీ నయనతార సినిమా వస్తుందంటే కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని కంటెంట్‌లతో నయన్ చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించడమే ఆమె సినిమాల క్రేజ్‌కు కారణమని చెప్పాలి. ఇక ఈ బ్యూటీ ఇటీవల సరోగసి ద్వారా తల్లి కావడంతో పెద్ద దుమారమే రేగింది. అయితే ఇప్పుడు మళ్లీ నయన్, తన సినిమాలపై ఫోకస్ పెట్టింది.

Nayanthara Connect Movie Special Premieres Tomorrow At AMB Cinemas
Nayanthara: సౌట్ ఇండస్ట్రీ స్టార్ బ్యూటీ నయనతార సినిమా వస్తుందంటే కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని కంటెంట్‌లతో నయన్ చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించడమే ఆమె సినిమాల క్రేజ్‌కు కారణమని చెప్పాలి. ఇక ఈ బ్యూటీ ఇటీవల సరోగసి ద్వారా తల్లి కావడంతో పెద్ద దుమారమే రేగింది. అయితే ఇప్పుడు మళ్లీ నయన్, తన సినిమాలపై ఫోకస్ పెట్టింది.
నయనతార నటిస్తున్న తాజా హార్రర్ సస్పెన్స్ మూవీ ‘కనెక్ట్’ సరికొత్త పంథాతో రానుంది. ఈ సినిమాకు ఎలాంటి ఇంటర్వెల్ లేకుండా వస్తుండటంతో ‘కనెక్ట్’ అసలు ఎలాంటి కథతో రాబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో నయనతారతో పాటు వినయ్ రాయ్, సత్యరాజ్, హనియా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు.
Nayanthara: కెరీర్‌లో తొలిసారి ఆ క్రేజీ హీరోతో రొమాన్స్‌కు రెడీ అయిన నయన్..?
ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ నయన్ ‘కనెక్ట్’ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తోంది. దీంతో ఈ సినిమాకు స్పెషల్ ప్రీమియర్ షో వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. డిసెంబర్ 20న AMB సినిమాస్‌లో నయనతార ‘కనెక్ట్’ మూవీని ప్రీమియర్స్ వేస్తున్నట్లు వారు తెలిపారు. దర్శకుడు అశ్విన్ శరవణన్ తెరకెక్కించిన ఈ హార్రర్ థ్రిల్లర్ మూవీలో బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కూడా నటిస్తుండటంతో ‘కనెక్ట్’ మూవీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.