Nayanthara: చిరు సినిమా కోసం నయన్ భారీ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా?

మన శంకరవరప్రసాద్ గారు, టాక్సిక్ సినిమాల కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకున్న లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara).

Nayanthara: చిరు సినిమా కోసం నయన్ భారీ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా?

Nayanthara huge remuneration for Mana Shankaravaraprasad garu movie.

Updated On : January 12, 2026 / 10:12 AM IST
  • సీనియర్ హీరోయిన్స్ లో నయనతార క్రేజ్ నెక్స్ట్ లెవల్
  • ఒక్కో సినిమాకు భారీ రెమ్యునరేషన్
  • వరుస ఆఫర్స్ కొట్టేస్తోంది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ మన శంకరవరప్రసాద్ గారు. కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించాడు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ తరువాత అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో క్రియేట్ అయ్యాయి. అలాగే, చాలా కాలం తరువాత చిరంజీవి వింటేజ్ లుక్స్ లో కనిపిస్తుండటం, అది కూడా ఫ్యామిలీ సినిమా చేస్తుండటంతో ఆడియన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేశారు.

ఎట్టకేలకు ఈ సినిమా నేడు (జనవరి 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్టుగానే ఆడియన్స్ నుంచి కూడా ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సినిమాలో చిరంజీవి వింటేజ్ లుక్స్, కామెడీ టైమింగ్, డాన్స్, యాక్షన్ ఒక రేంజ్ లో వర్కౌట్ అయ్యాయంటూ ఆడియన్స్ చెప్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది.

Parasakthi: పరాశక్తి మూవీలో ‘గోల్టీ’ పదం.. తెలుగువాళ్లను ఆ మాట ఎలా అంటారు.. బైకాట్ పరాశక్తి ట్రెండ్

అదేంటంటే, మన శంకరవరప్రసాద్ గారు సినిమా కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారకి(Nayanthara) భారీ రెమ్యునరేషన్ ఇచ్చారట. ఈ సినిమా కోసం ఏకంగా రూ.5 కోట్ల తీసుకుందట ఈ బ్యూటీ. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోయిన్స్ లో ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకోవడం అనేది గ్రేట్ అనే చెప్పాలి. ప్రెజెంట్ ఉన్న క్రేజీ హీరోయిన్ లకు ధీటుగా ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకోవడంతో నయన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

కేవలం ఈ సినిమానే కాదు కన్నడ స్టార్ యష్ హీరోగా వస్తున్న టాక్సిక్ సినిమా కోసం కూడా ఏకంగా రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుందట నయనతార. ఇక అవకాశాలు కూడా ఈ అమ్మడుకు బాగానే వస్తున్నాయి. ఇటీవలే ఆమె బాలకృష్ణతో ఒక సినిమాకు ఒకే చెప్పింది. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం కూడా అదిరిపోయే రెమ్యునరేషన్ తీసుకుంటుందట నయనతార.