నయనతార ‘ఐరా’ మూవీ ట్రైలర్ విడుదల

సౌత్‌లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న నయనతార ప్రస్తుతం లేడి సూపర్ స్టార్‌గా పేరు కొట్టేసింది. తమిళంలో వరుస బెట్టి సినిమాలు తీసుకుంటూ పోతోంది. లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే హీరోయిన్‌గా రాణిస్తోంది. రీసెంట్‌గా నయనతార నటించిన తమిళ చిత్రం ‘ఇమైక్క నోడిగల్’ తెలుగులో ‘అంజలి సీబీఐ ఆఫీసర్’ పేరుతో విడుదలైంది.
ఈ సినిమా టాలీవుడ్‌లో సూపర్ హిట్ అయింది.. ప్రస్తుతం సైరా చిత్రంతో పాటు పలు తమిళ సినిమాలతో బిజీగా ఉన్న నయనతార కొన్నాళ్ళ నుండి ‘ఐరా’ అనే చిత్రం చేస్తుంది.
Read Also : అరవకండి.. ఓటేయండి.. సీఎం కాదు.. పీఎం కూడా అవుతాడు
కోటపాటి రాజేష్ నిర్మాతగా సర్జన్ కె.ఎమ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఆమె 63వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార డబుల్ రోల్‌లో నటిస్తుంది. చాలా తక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘గ్రహణం’ ఫేమ్ సుందరమూర్తి సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్ర టీజర్ ఇప్పటికే విడుదల కాగా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఇందులోని సన్నివేశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
తెలుగు, తమిళంలో ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది. ఈ మధ్య వరస విజయాలతో జోరు మీదున్న నయనతార.. ఐరాతో మరో విజయం అందుకుంటానని ధీమాగా చెబుతుంది. మరి ఈమె నమ్మకాన్ని ‘ఐరా’ సినిమా ఎంతవరకు నిలబెడుతుందో చూడాలిక.
Read Also : ఓటర్ నుంచి తొలి లిరికల్ సాంగ్ విడుదల