ఇండియా టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య లుక్ : ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్.. RFCలో సెకండ్ షెడ్యూల్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న NBK 105 న్యూ పోస్టర్స్.. సెప్టెంబర్ 5 నుండి రామోజీ ఫిలింసిటీలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న NBK 105 న్యూ పోస్టర్స్.. సెప్టెంబర్ 5 నుండి రామోజీ ఫిలింసిటీలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది..
నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న NBK 105 న్యూ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సి.కె.ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో, హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో జరిగింది. ఇటీవల రిలీజ్ చేసిన బాలయ్య లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
వినాయక చవితి సందర్భంగా పండక్కి ఒకరోజు ముందు రెండు న్యూ పోస్టర్స్ విడుదల చెయ్యగా.. బాలయ్య లుక్‌కి భారీ స్పందన వచ్చింది. బాలయ్య లుక్‌తో ఒకరోజు ముందుగానే పండగ చేసుకున్నారు నందమూరి అభిమానులు. సెప్టెంబర్ 1 ఆదివారం NBK 105 న్యూ పోస్టర్స్ ఇండియా ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉండడం విశేషం.. సెప్టెంబర్ 5 నుండి రామోజీ ఫిలింసిటీలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.
Read Also : బాబాయ్‌ని విష్ చేసిన అబ్బాయ్..
బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపించనున్నాడు. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్.. భూమిక, జయసుధ, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రధారులు..యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్‌ను త్వరలో ప్రకటించనున్నారు. కథ : పరుచూరి మురళిమాటలు : ఎమ్.రత్నం, సంగీతం : చిరంతన్ భట్, ఆర్ట్ : చిన్నా, కెమెరా : సి. రామ్ ప్రసాద్, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : కె.ఎస్.రవికుమార్..