బాబాయ్‌ని విష్ చేసిన అబ్బాయ్

సెప్టెంబర్ 2.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 48వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువ..

  • Published By: sekhar ,Published On : September 2, 2019 / 08:29 AM IST
బాబాయ్‌ని విష్ చేసిన అబ్బాయ్

సెప్టెంబర్ 2.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 48వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువ..

సెప్టెంబర్ 2.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు పవన్‌కు బర్త్‌డే విషెస్ తెలిపుతున్నారు. పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. హ్యాపీ బర్త్‌డే జనసేనాని హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాబాయ్ కళ్యాణ్‌ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

పవన్, చరణ్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఆల్వేస్ ఫ్రెండ్, గైడ్, మెంటర్’ అంటూ బాబాయ్‌ని ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు చెర్రీ. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. బాబాయ్ పవన్‌కు బర్త్‌డే విషెస్ చెప్తూ.. వాల్మీకి మూవీ న్యూ పోస్టర్ రిలీజ్ చేశాడు. 

Read Also : ఇండియా టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య లుక్ : ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్.. RFCలో సెకండ్ షెడ్యూల్..

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మారుతి దర్శకత్వంలో నటిస్తున్న ప్రతిరోజూ పండగే సెట్‌లో కేక్ కట్ చేసి కళ్యాణ్ బర్త్ డే‌ని సెలబ్రేట్ చేశాడు.  మాజీ సీఎమ్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ కూడా పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు. 
  

 

 

Image