NBK 112 : అమరావతిలో బాలయ్య కొత్త సినిమా గ్రాండ్ ఓపెనింగ్..? ఎప్పుడంటే..?
తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది. (NBK 112)
NBK 112
NBK 112 : బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ కొరటాల శివతో సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మొదటిసారి ఈ కాంబో వస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది.
బాలకృష్ణ – కొరటాల శివ కొత్త సినిమా జూన్ 25న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గ్రాండ్ గా ఓపెనింగ్ పూజ కార్యక్రమం నిర్వహించబోతున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమాన్ని భారీగా ఫ్యాన్స్ మధ్యలో చేయనున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన, దీనికి ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ రావాల్సి ఉంది.
Also Read : Vijay Deverakonda Rashmika : సొంతూళ్లో విజయ్ రష్మిక.. ఫ్యామిలీతో స్పెషల్ ఫొటోలు వైరల్..
బాలయ్య అక్కడ ఎమ్మెల్యే కాబట్టి ప్రమిషన్ అయితే వచ్చేస్తుంది. మరి మూవీ యూనిట్ అక్కడ భారీగా ఓపెనింగ్ నిర్వహిస్తారా చూడాలి. అమరావతిలో సినిమా ఓపెనింగ్ జరిగితే అక్కడ సినిమా ఓపెనింగ్ జరిగిన మొదటి సినిమాగా బాలయ్య – కొరటాల శివ సినిమా నిలిచిపోతుంది. దీంతో ఇది నిజం అవ్వాలని బాలయ్య ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.
