NBK107: “సుగుణ సుందరి” అంటూ బాలయ్య మాస్ స్టెప్పులు.. NBK107 సాంగ్ లీక్!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. "NBK107" వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

NBK107: “సుగుణ సుందరి” అంటూ బాలయ్య మాస్ స్టెప్పులు.. NBK107 సాంగ్ లీక్!

NBK107 Song Leaked

Updated On : October 13, 2022 / 12:03 PM IST

NBK107: నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. “NBK107” వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Nandamuri Bala Krishna: పిలిచారు.. కానీ, జగన్‌ని కలవను -బాలకృష్ణ

ఇటీవలే చిత్ర యూనిట్ ఈ మూవీ యొక్క టర్కీ షెడ్యూల్ పూర్తీ చేసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. ఆ షెడ్యూల్ సమయంలో బాలయ్యపై ఒక సాంగ్ తెరకెక్కిస్తుండగా, అందుకు సంబంధించిన వీడియోని ఒక నెటిజెన్ నెట్టింట పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో బాలకృష్ణ “సుగుణ సుందరి.. సుగుణ సుందరి.. సుర సుర చూపుల రంగేళి” అంటూ సాగుతున్న పాటకి బాలయ్య మాస్ స్టెప్ లు వేస్తూ ఇరగదీస్తున్నాడు.

ఈ వీడియోని బాలయ్య ఫ్యాన్స్ షేర్లు మీద షేర్లు చేస్తూ.. ఇలాంటి మాస్ బీట్ ఇచ్చినందుకు డైరెక్టర్ తమన్ ని పొగిడేస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవబోతున్నట్లు తెలుస్తుంది.