Neha Chowdary : డాన్స్ ప్రాక్టీస్‌లో ప్రమాదం.. మూడువారాల్లో తగ్గకపోతే సర్జరీ.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నేహా..

తాజాగా నేహా తన గాయం గురించి వివరణ ఇస్తూ ఓ వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది.

Neha Chowdary : డాన్స్ ప్రాక్టీస్‌లో ప్రమాదం.. మూడువారాల్లో తగ్గకపోతే సర్జరీ.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నేహా..

Neha Chowdary Injured while Dance Practice Emotional Video Shared

Updated On : April 28, 2024 / 3:34 PM IST

Neha Chowdary : యాంకర్, నటి, జిమ్నాస్టిక్ ప్లేయర్ గా నేహా చౌదరి అందరికి పరిచయమే. బిగ్ బాస్ లోకి కూడా వెళ్లి మరింత పాపులర్ అయింది. గత కొన్నాళ్లుగా నీతోనే డాన్స్ షోలో నటుడు విశ్వతో కలిసి పర్ఫార్మెన్స్ చేస్తుంది నేహా. అయితే తాజాగా వచ్చిన ఎపిసోడ్ ప్రోమోలో నేహా మెడకు బెల్ట్ తో కనపడి, గాయం అయిందని తెలిపి, షో నుంచి తప్పుకున్నట్టు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.

దీంతో షోలో ఉన్నవాళ్ళతో పాటు నేహా అభిమానులు, ఫాలోవర్స్ కూడా నేహాకి ఏమైంది అని అంతా కంగారుపడ్డారు. తాజాగా నేహా దీనిపై వివరణ ఇస్తూ ఓ వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది.

Also Read : Samantha : నిర్మాతగా సమంత ఫస్ట్ మూవీ అనౌన్స్.. ‘మా ఇంటి బంగారం’ అంటూ.. బర్త్‌డే స్పెషల్ పోస్టర్..

ఈ వీడియోలో నేహా చౌదరి మాట్లాడుతూ.. డాన్స్ ప్రాక్టీస్ లో దెబ్బ తగిలి ఇంజ్యుర్ అయింది. మొదట లైట్ తీసుకున్నాను. నేను స్పోర్ట్ పర్సన్ కావడంతో ఇలాంటి ఇంజ్యురీలు చాలా అయ్యాయి. అందుకే ఇది కూడా లైట్ తీసుకున్నాను తగ్గిపోతుంది అని. కానీ రోజు రోజుకి నొప్పి బాగా పెరగడంతో, విశ్వ కూడా చెప్పడంతో హాస్పిటల్ కి వెళ్ళాను. ఈ గాయం వల్ల ఎడమ చెయ్యి బాగా నొప్పి వచ్చి గుండె పట్టేసినట్టు అనిపించింది. డాక్టర్ దగ్గరకు వెళ్తే దెబ్బ తగిలిన తర్వాత కూడా పట్టించుకోకుండా డాన్స్ చేసినందుకు ఇంకా ఎఫెక్ట్ ఎక్కువయింది అన్నారు. ప్రస్తుతం కనీసం ఆరు వారాలు రెస్ట్ ఇవ్వాలి. మూడు వారాలు మెడకు ఒక బెల్ట్ ఇస్తారు, అది పెట్టుకొని కదలకుండా కూర్చోవాలి, పడుకోవాలి అన్నారు. మూడు వారాల్లో ఏమాత్రం తగ్గకపోతే సర్జరీ చేస్తా అని చెప్పారు. డాన్స్ షోలో పాల్గొనలేకపోతున్నందుకు, నా వల్ల విశ్వ కూడా షోలో ఆగిపోవాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది అని ఎమోషనల్ అయింది నేహా. దీంతో నేహా త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు కామెంట్స్ చేస్తున్నారు.