Nelson Dilip Kumar : రజినీకాంత్ – విజయ్ ఒకే సినిమాలో.. నా డ్రీమ్ అదే.. జైలర్ డైరెక్టర్ నెల్సన్..

ప్రస్తుతం నెల్సన్ జైలర్ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. పలు సక్సెస్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నా డ్రీమ్ అంటూ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు నెల్సన్.

Nelson Dilip Kumar : రజినీకాంత్ – విజయ్ ఒకే సినిమాలో.. నా డ్రీమ్ అదే.. జైలర్ డైరెక్టర్ నెల్సన్..

Nelson Dilip Kumar says his dream is Direct a Movie with Rajinikanth and Vijay Multi starer

Rajinikanth – Vijay :  తమిళ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilip Kumar) తాజాగా రజినీకాంత్ తో జైలర్(Jailer) సినిమాతో వచ్చి భారీ విజయం సాధించాడు. నెల్సన్ ఫస్ట్ రెండు సినిమాలు కోలమవు కోకిల, డాక్టర్(Doctor) మంచి విజయాలు సాధించాయి. మూడో సినిమా విజయ్ బీస్ట్(Beast) యావరేజ్ గా నిలిచింది. దీంతో నెల్సన్ పై విజయ్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు జైలర్ సినిమాతో వచ్చి బిగ్ హిట్ కొట్టి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు నెల్సన్.

ప్రస్తుతం నెల్సన్ జైలర్ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. పలు సక్సెస్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నా డ్రీమ్ అంటూ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు నెల్సన్.

నెల్సన్ మాట్లాడుతూ.. చిన్నప్పట్నుంచి నేను రజిని సర్ కి ఫ్యాన్ ని. ఆ తర్వాత విజయ్ అన్నకి కూడా అభిమానిని. వాళ్ళిద్దరితో ఎప్పటికైనా సినిమాలు చేయాలి అనుకునేవాడిని. ఇద్దరితో సినిమాలు చేశాను. రజిని సర్ – విజయ్ అన్నని కలిపి వారిద్దరితో ఒక సినిమా చేయాలి అనేది నా డ్రీమ్. కానీ ఇద్దరికీ కరెక్ట్ గా సెట్ అయ్యే కథ రాయాలంటే చాలా కష్టం. కానీ కథ రాస్తే నిజంగా ఇద్దర్ని కలిపి సినిమా చేస్తాను, చేయడానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు.

Chiranjeevi : భోళా శంకర్ అయిపోయింది.. చిరు నెక్స్ట్ ఏంటి? బర్త్ డేకి ఆ దర్శకుడితో సినిమా అనౌన్స్?

అయితే విజయ్ చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేశాడు. అందులో రజినీకాంత్ నాన్ సిగప్పు మనితన్ అనే సినిమాలో కూడా చిన్న పాత్ర చేశాడు విజయ్. ఈ సినిమాకు విజయ్ తండ్రి SA చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు.. అది కూడా రజినీకాంత్, విజయ్ కలిసి సినిమా అంటే అది ఓ రేంజ్ లో ఉంటుంది, అంచనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది నిజమవ్వాలని, వారిద్దరి కాంబినేషన్ లో సినిమా రావాలని పలువురు అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి మరి రజిని – విజయ్ కాంబోలో నెల్సన్ దర్శకత్వంలో సినిమా వస్తుందో రాదో.