Anupama Parameswaran: బికినీ ఫోటో అడిగిన నెటిజన్.. అనుపమ ఏమందో తెలుసా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ సినిమాతో తెలుగు సినిమాకి పరిచయమైన బ్యూటీ అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran: బికినీ ఫోటో అడిగిన నెటిజన్.. అనుపమ ఏమందో తెలుసా?

Anupama Parameshwaran

Updated On : October 1, 2021 / 11:15 PM IST

Anupama Parameswaran: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ సినిమాతో తెలుగు సినిమాకి పరిచయమైన బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. శతమానంభవతి లాంటి సినిమాలతో సూపర్ హిట్ దక్కించుకున్న ఎందుకో ఆశించిన స్థాయి అనుకి అవకాశాలు దక్కడం లేదేమో అనిపిస్తుంది. సినిమాల సంగతెలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది.

Anaika Soti: అందాలతో చిత్రవధ చేస్తున్న అనైకా సోతీ!

నిజానికి అనుపమ ఒక్కటే కాదు.. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడమే కాకుండా నెటిజన్లతో చాటింగ్ చేస్తూ మరింత దగ్గరవుతున్నారు. అయితే, ఈ క్రమంలో కొన్ని వింత పరిస్థితులు కూడా చూడాల్సి వస్తుంది. ఉంగరాల జుట్టు చిన్నది అనుపమ కూడా అలాంటి పరిస్థితే ఎదుర్కొంది. అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే నెటిజెన్స్ అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెబుతూ ప్రేక్షకులను సందడి చేసిన ఈ బ్యూటీకి ఒక నెటిజన్ నుంచి విచిత్రమైన ప్రశ్న ఎదురయింది.

Nivetha Pethuraj: అందానికే కేరాఫ్ అడ్రస్ ఈ మలయాళ కుట్టీ

ఓ నెటిజన్ అనుపమను తను బికినీ వేసుకున్నటువంటి ఫోటో పంపించమని అడగడంతో ఎంతో కోపం తెచ్చుకున్న అనుపమ ఎవరు ఊహించని విధంగా రిప్లై ఇచ్చింది. నీ ఇంటి అడ్రస్ చెప్పు నీ ఇంటికే నా బికినీ ఫోటో పంపిస్తా.. ప్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకో అంటూ అనుపమ సదరు నెటిజన్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఇకపోతే అనుపమ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ నిఖిల్ సరసన 18 పేజెస్ చిత్రంలో నటిస్తుంది.