#BoycottMirzapur2: ఈ వెబ్ సిరీస్ మేం చూడం..

  • Published By: sekhar ,Published On : October 8, 2020 / 05:50 PM IST
#BoycottMirzapur2: ఈ వెబ్ సిరీస్ మేం చూడం..

Updated On : October 8, 2020 / 5:54 PM IST

Boycott Mirzapur: పాపులర్ వెబ్ సిరీస్ Mirzapur Season 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ విడుదల కాకముందు నుంచే మీర్జాపూర్‌ సీక్వెల్‌‌ను బాయ్‌కాట్‌ చేయాలంటూ సోషల్‌ మీడియాలో #BoycottMirzapur2 అనే హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు నెటిజన్స్.



కాగా ఈ వ్యతిరేకతకు కారణం ఈ సిరీస్‌లో హీరోగా నటిస్తున్న ఫజల్‌ అలీ, సహా నిర్మాత ఫర్హాన్‌ అక్తర్‌లు. గతేడాది వీరు పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు మద్దతునిచ్చారు. వారి తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ ‘తమ దేశానికి విధేయత చూపని నటుల సినిమాలు కానీ వెబ్‌ సిరీస్‌లు కానీ మేం చూడబోం.. మాకోద్దు #BoycottMirzapur2’ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ను‌ ట్రెండ్‌ చేస్తున్నారు.



మరోవైపు ఈనెల 23 నుంచి Amazon Prime లో మీర్జాపూర్ స్ట్రీమింగ్ కానుందని ప్రమోషన్స్ మోత మోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో విడుదల కావడం సందేహమే అనే మాటలూ వినిపిస్తున్నాయి.