ఇస్మార్ట్ బ్యూటీ కొత్త కారు చూశారా?

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన నిధి అగర్వాల్. ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడి.. కుమారుడు గల్లా అశోక్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాని దేవదాస్ ఫేం శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు. పద్మావతి గల్లా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో రూ. 90 లక్షల విలువ చేసే కారు కొన్నట్టు తెలిపుతూ… కొత్త సంవత్సరంలో నీకు వెల్‌కమ్ చెబుతున్నానంటూ పోస్ట్ పెట్టింది. ఇది చూసి ఇస్మార్ట్ శంకర్ తో నిధి లైఫే మారిపోయిందని నెటిజన్స్ అంటున్నారు.
అంతేకాదు ఇప్పుడు తన పారితోషికానికి మూడు రెట్లు పెంచిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం నిధి చేతిలో నాలుగు సినిమాలు కూడా ఉన్నాయి.. మొత్తానికి డబ్బు సంపాదించి కారు కొని కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది నిధి.