Nidhhi Agerwal : ఓటీటీ కంటే సినిమాకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను..

నిధి మాట్లాడుతూ.. ''ఓటీటీలో నాకు అవకాశాలు వస్తున్నాయి కానీ నాయికగా నా తొలి ప్రాధాన్యం సినిమానే. ఇతర భాషలకన్నా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా....................

Nidhhi Agerwal : ఓటీటీ కంటే సినిమాకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను..

Nidhhi Agerwal

Updated On : June 13, 2022 / 8:45 AM IST

Nidhhi Agerwal :  ఇటీవల చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో పాటు ఓటీటీలలో సినిమాలు, సిరీస్ లలో కూడా యాక్ట్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ సైతం వచ్చిన అవకాశాలని వాడుకుంటున్నారు. కరోనా తర్వాత చాలా మంది సెలబ్రిటీలు ఇదే కోవలోకి వచ్చారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం నేను సినిమాకే ప్రాధాన్యత ఇస్తాను అంటుంది.

‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన తెలుగు భామ నిధి అగర్వాల్. ఆ తర్వాతబి ఒకపక్క తమిళ సినిమాలు చేస్తూనే, తెలుగులో ఇస్మార్ట్‌ శంకర్‌, హీరో, మిస్టర్ మజ్ను.. లాంటి సినిమాలతో మెప్పించింది. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నటిస్తుంది. ఇటీవల నిధి అగర్వాల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Samantha : సమంత కేవలం దానివల్లే నెలకు మూడు కొట్లు సంపాదిస్తుంది..

నిధి మాట్లాడుతూ.. ”ఓటీటీలో నాకు అవకాశాలు వస్తున్నాయి కానీ నాయికగా నా తొలి ప్రాధాన్యం సినిమానే. ఇతర భాషలకన్నా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఉండటమే నాకు సంతోషాన్నిస్తుంటుంది. తెలుగమ్మాయిని కావడమే అందుకు కారణం. ప్రతి సినిమా నాకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తుంది. షూటింగ్‌లతో సరదాగా గడుపుతుంటాను, షూటింగ్స్ లేకపోతే మా ఫ్యామిలీ బిజినెస్‌ చూసుకుంటాను. పెద్ద హీరోలతోనే నటించాలని లేదు. నేను చేసిన కొన్ని సినిమాలు నాకు గ్లామర్‌ పేరు తీసుకొచ్చాయి. కానీ నేను డీగ్లామర్‌ క్యారెక్టర్‌లలో కూడా కనిపించడానికి రెడీనే” అని తెలిపింది.