Niharika : ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోతో నిహారిక రెండో సినిమా.. ఇంకో హిట్టు కోసం ప్లానింగ్..

తాజాగా నేడు నిహారిక తన రెండు సినిమాని అధికారికంగా ప్రకటించింది.

Niharika : ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోతో నిహారిక రెండో సినిమా.. ఇంకో హిట్టు కోసం ప్లానింగ్..

Niharika Konidela Announced Second Film with Sangeeth Shobhan

Updated On : April 2, 2025 / 3:12 PM IST

Niharika : మెగా డాటర్ నిహారిక కొణిదెల ఓ పక్క నటిగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా సిరీస్ లు, సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నిహారిక ఇటీవల కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టింది. కొత్త డైరెక్టర్, కొత్త నటీనటులతో చిన్న సినిమాగా వచ్చి 50 కోట్ల వసూళ్లు సాధించి టాలీవుడ్ లో చర్చగా మారింది. ఇప్పుడు నిహారిక నిర్మాతగా రెండో సినిమాతో రానుంది.

తాజాగా నేడు నిహారిక తన రెండు సినిమాని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో ఫుల్ ఫామ్ లో ఉన్న నటుడు సంగీత్ శోభన్ హీరోగా నటించబోతున్నాడు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో పాటు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, 3 రోజెస్.. పలు సిరీస్ లతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు సంగీత్. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాల్లో సంగీత్ DD పాత్రలో ఫుల్ గా నవ్వించాడు.

Also Read : Kadambari Kiran : నటుడు కాదంబరి కిరణ్ మనం సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. ఉచిత మెగా వైద్య శిబిరం..

ఇటీవలే మ్యాడ్ స్క్వేర్ సినిమాతో హిట్ కొట్టిన సంగీత్ శోభన్ ఇప్పుడు మెయిన్ లీడ్ లో నిహారిక నిర్మాణంలో సినిమాని ప్రకటించడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మాణంలో నిహారిక నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాతో మానస శర్మ అనే అమ్మాయి దర్శకురాలిగా పరిచయం కాబోతుంది. దీంతో నిహారిక రెండో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. సంగీత్ గతంలో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సిరీస్ లో నిహారిక నిర్మాణంలోనే నటించాడు. మానస కూడా నిహారిక నిర్మాణ సంస్థలో పనిచేసింది. దీంతో నిహారిక – సంగీత్ కలిసి హిట్ కొట్టే ప్లాన్ లోనే ఉన్నారు.