Nikhil Siddhartha : ‘స్పై’ సినిమా కాంట్రవర్సీ అవుతుందని అనుకుంటున్నారు.. నాపై చాలా ఒత్తిడి ఉంది.. నిఖిల్ కామెంట్స్
సుభాష్ చంద్రబోస్ ఇష్యూ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. దానిపై సినిమా అనడంతో ఎవరు ఎలా స్పందిస్తారో, ముఖ్యంగా పొలిటికల్ పార్టీలు ఎలా స్పందిస్తాయి, ఈ సినిమాలో ఏం చూపించబోతున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. స్పై ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిఖిల్ మాట్లాడుతూ...

Nikhil Siddhartha comments on Spy Movie controversy
SPY Movie : ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ(Nikhil Siddhartha) కార్తికేయ 2(Karthikeya 2), 18 పేజెస్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమా ‘స్పై’తో రాబోతున్నాడు. ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నాడు నిఖిల్. ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య మీనన్(Iswarya Menon) నటిస్తుంది. గ్యారీ దర్శకుడిగా ఈ సినిమా భారీగా తెరకెక్కింది. నిఖిల్ ‘స్పై’(SPY) సినిమా జూన్ 29న పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు.
స్పై సినిమా సుభాష్ చంద్రబోస్(Subhas Chandrabose) మరణం వెనుక ఉన్న రహస్యాల ఆధారంగా తెరకెక్కించినట్టు సమాచారం. ఇప్పటికే ‘స్పై’ టీజర్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా తాజాగా నిన్న స్పై ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాలో రానా గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నాడు. అలాగే ఆర్యన్ రాజేష్ కూడా చాలా రోజుల తర్వాత గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు ఈ సినిమాతో. స్పై సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని అల్లు అర్జున్ థియేటర్ AAA సినిమాస్ లో నిర్వహించారు.
సుభాష్ చంద్రబోస్ ఇష్యూ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. దానిపై సినిమా అనడంతో ఎవరు ఎలా స్పందిస్తారో, ముఖ్యంగా పొలిటికల్ పార్టీలు ఎలా స్పందిస్తాయి, ఈ సినిమాలో ఏం చూపించబోతున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. స్పై ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిఖిల్ మాట్లాడుతూ..సినిమాకి ఆల్రెడీ సెన్సార్ కూడా పూర్తయింది. ఎలాంటి అడ్డంకులు రాలేదు. సినిమాలో కాంట్రవర్సీ ఉంటుందని అంతా అనుకుంటున్నారు. కానీ అలాంటివి ఏం ఉండవు. సినిమా వల్ల ఎలాంటి కాంట్రవర్సీ రాదు. ఈ సినిమా ద్వారా మేము ఎవర్ని ఇబ్బంది పెట్టాలని, ఎవర్ని హర్ట్ చేయాలని అనుకోవట్లేదు. చరిత్రకు సంబంధించి తెలియని కోణాన్ని చూపించబోతున్నాము. దీనికోసం మేము చాలా రీసెర్చ్ చేశాము. ప్రభుత్వం దగ్గర్నుంచి కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము అని అన్నారు.
RGV : నన్ను పార్టీలోకి రమ్మన్నారు, పోటీ చేయమన్నారు.. కానీ.. పొలిటికల్ ఎంట్రీపై ఆర్జీవీ వ్యాఖ్యలు..
ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. కెరీర్ లో ఎదిగే కొద్దీ బాధ్యత పెరుగుతుందని ఇటీవలే అర్థమైంది. కొన్నాళ్ల క్రితం వరకు అవకాశం వస్తే చాలు, చేసిన సినిమా రిలీజ్ అయితే చాలు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితే దానికి మించిన హిట్ ఇవ్వాలనే పరిస్థితి ఏర్పడింది. నా మీద ఒత్తిడి కూడా ఉంది. మాకే ఇలా ఉందంటే స్టార్ హీరోలకి ఇంకెంత ఒత్తిడి ఉంటుందో. బాధ్యతగా, ఆ ఒత్తిడితో పనిచేస్తున్నాను, మంచి ఫలితాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను. స్పై సినిమా పాన్ ఇండియా సినిమా, అందరికి నచ్చుతుంది. అందుకే పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాము అని తెలిపారు నిఖిల్. జూన్ 29న రిలీజ్ కాబోయే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.