Nikhil Siddhartha : వేరే రాష్ట్రాల అభిమానులకు సారీ చెప్పిన నిఖిల్.. స్పై సినిమా విషయంలో.. ఎందుకో తెలుసా?

ఇక స్పై సినిమా మొదటి రోజు 11.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫస్ట్ డే గ్రాసర్ గా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా 25 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అయితే తాజాగా నిఖిల్ వేరే రాష్ట్రాల అభిమానులకు సారీ చెప్తూ ఓ లేఖని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Nikhil Siddhartha : వేరే రాష్ట్రాల అభిమానులకు సారీ చెప్పిన నిఖిల్.. స్పై సినిమా విషయంలో.. ఎందుకో తెలుసా?

Nikhil Siddhartha emotional letter on Spy movie and says sorry to Fans

Updated On : July 5, 2023 / 11:42 AM IST

Nikhil Siddhartha Spy :  నిఖిల్ సిద్ధార్థ(Nikhil Siddhartha) కార్తికేయ 2(Karthikeya 2), 18 పేజెస్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి తాజాగా మరో పాన్ ఇండియా సినిమా ‘స్పై’తో వచ్చాడు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. స్పై సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య మీనన్(Iswarya Menon) నటించగా గ్యారీ దర్శకుడిగా ఈ సినిమా భారీగా తెరకెక్కింది. నిఖిల్ ‘స్పై’(SPY) సినిమా జూన్ 29న పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. అయితే అన్ని భాషల్లోరిలిజ్ చేద్దామనుకున్నప్పటికీ కొన్ని టెక్నీకల్ కారణాల వల్ల వేరే భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు. తెలుగులోనే ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేశారు.

ఇక స్పై సినిమా మొదటి రోజు 11.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫస్ట్ డే గ్రాసర్ గా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా 25 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అయితే తాజాగా నిఖిల్ వేరే రాష్ట్రాల అభిమానులకు సారీ చెప్తూ ఓ లేఖని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Devil : డెవిల్ గ్లింప్స్ రిలీజ్.. నందమూరి అభిమానులకు కళ్యాణ్ రామ్ బర్త్‌డే గిఫ్ట్..

ఈ లేఖలో.. స్పై సినిమాకోసం థియేటర్‌లలో విచ్చేసినందుకు బాక్సాఫీస్ వద్ద నా కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్‌ని అందించినందుకు మీ అందరికీ నేను నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నాపై ఎంత నమ్మకం ఉందో తెలుసుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. కాంట్రాక్ట్, కంటెంట్ సమస్యల కారణంగా ఈ సినిమా భారతదేశం అంతటా అన్ని భాషల్లో విడుదల జరగలేదని మీ అందరికీ తెలియజేయడం నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఓవర్సీస్ లో సైతం కొన్ని సమస్యల కారణంగా తెలుగు ప్రీమియర్ షోలు రద్దయ్యాయి. నేను హిందీ, కన్నడ, తమిళం, మలయాళ ప్రేక్షకుల అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. నా తదుపరి రాబోయే 3 సినిమాలు అన్ని భాషల్లో థియేటర్లలో ఉంటాయి. పర్ఫెక్ట్‌గా ఫినిష్ చేసి టైమ్‌కి రిలీజ్ చేస్తాను. నాపై నమ్మకం ఉంచే ప్రతి సినీ ప్రేమికుడికి కూడా నేను వాగ్దానం చేస్తున్నాను. ఇక నుండి సినిమా నాణ్యత విషయంలో నేను రాజీపడను. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా మంచి అవుట్ పుట్ ఇస్తాను అని పేర్కొన్నాడు నిఖిల్. దీంతో ఈ లెటర్ వైరల్ గా మారగా. ఇలా రాసినందుకు నిఖిల్ ని అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు .