Nikhil Siddhartha : సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పాసులు ఫ్రీగా కావాలా? ఫ్యాన్స్ కి సూపర్ ఆఫర్ ఇచ్చిన నిఖిల్.. కానీ ఈ పని చెయ్యాలి..

నేడు శనివారం తెలుగు వారియర్స్ టీం పంజాబ్ టీంతో బెంగుళూరులో తలపడనుంది. ఈ నేపథ్యంలో హీరో నిఖిల్ సిద్దార్థ్ ఈ మ్యాచ్ చూడటానికి 100 మందికి ఫ్రీగా పాసులు ఇస్తానంటూ ఆఫర్ ప్రకటించాడు. ఇటీవల ఆడిన రెండు మ్యాచ్ లలోను....................

Nikhil Siddhartha : సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పాసులు ఫ్రీగా కావాలా? ఫ్యాన్స్ కి సూపర్ ఆఫర్ ఇచ్చిన నిఖిల్.. కానీ ఈ పని చెయ్యాలి..

Nikhil Siddhartha giving free passes to Celebrity Cricket League match in bengaluru

Updated On : March 4, 2023 / 11:58 AM IST

Nikhil Siddhartha :  గత రెండు వారాలుగా ప్రతి శనివారం, ఆదివారం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. 8 సినీ పరిశ్రమల నుంచి 8 జట్లు ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో పాల్గొంటున్నాయి. మన టాలీవుడ్ నుంచి తెలుగు వారియర్స్ వరుసగా విజయాలు సాధిస్తుంది. ఇక మన అఖిల్ మంచి క్రికెటర్ అని అందరికి తెలిసిందే. ఇప్పటికే జరిగిన మ్యాచుల్లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. ఈ మ్యాచులకు సినీ, క్రికెట్ అభిమానులు భారీగానే హాజరవుతున్నారు.

నేడు శనివారం తెలుగు వారియర్స్ టీం పంజాబ్ టీంతో బెంగుళూరులో తలపడనుంది. ఈ నేపథ్యంలో హీరో నిఖిల్ సిద్దార్థ్ ఈ మ్యాచ్ చూడటానికి 100 మందికి ఫ్రీగా పాసులు ఇస్తానంటూ ఆఫర్ ప్రకటించాడు. ఇటీవల ఆడిన రెండు మ్యాచ్ లలోను తెలుగు వారియర్స్ విజయం సాధించింది. రాయ్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో నిఖిల్ వీడియోని ఓ అభిమాని షేర్ చేయగా నిఖిల్ ఆ వీడియోని తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. నా మీద ప్రేమ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు అని పోస్ట్ చేశాడు.

అలాగే ఈ వీడియోని షేర్ చేస్తూ.. ఇవాళ బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో మధ్యాహ్నం జరిగే మ్యాచ్ కు 100 మందికి పాసులు ఇస్తాను. మీరు చేయాల్సింది ఒకటే. తెలుగు వారియర్స్ ని సపోర్ట్ చేస్తూ CCL ని ట్యాగ్ చేయండి. అలాగే నా రాబోయే సినిమా స్పై కి ఒక మంచి రిలీజ్ డేట్ ని కూడా చెప్పండి అని పోస్ట్ చేశాడు. దీంతో నిఖిల్ అభిమానులు, పలువురు నెటిజన్లు నిఖిల్ పెట్టిన ట్వీట్ ని షేర్ చేస్తున్నారు.

WPL 2023 Opening Ceremony : ఉమెన్స్ ఐపీఎల్ ఓపెనింగ్ లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వనున్న బాలీవుడ్ భామలు..

నిఖిల ఇటీవల కార్తికేయ సినిమాతో దేశవ్యాప్తంగా భారయీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్ సినిమా కూడా తెలుగులో మంచి విజయం సాధించింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడంతో తన నెక్స్ట్ సినిమా స్పై ని కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి హ్యాట్రిక్ హిట్ కొట్టాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో CCL ని ఇలా తన సినిమా ప్రమోషన్ కి కూడా వాడుకుంటున్నాడు నిఖిల్.