Nikhil Siddhartha : ఒక పాన్ ఇండియా సక్సెస్.. చేతిలో మరో నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్.. నిఖిల్ లైనప్!
కార్తికేయ 2 తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న నిఖిల్ సిద్దార్థ మూవీ లైనప్ మాములుగా లేదు. ప్రస్తుతం తన చేతిలో మరో నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్..

Nikhil Siddhartha line up a 4 pan india projects with crazy combinations
Nikhil Siddhartha Movies : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ ప్రస్తుతం ఇండియా వైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో అయ్యిపోయాడు. కార్తికేయ 2 (Karthikeya 2) తో పాన్ ఇండియా సక్సెస్ అందుకొని ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో పాటు పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ ఇమేజ్ ని కాపాడుకునేలా తన తదుపరి ప్రాజెక్ట్స్ ని సెట్ చేస్తున్నాడు. ప్రస్తుతం నిఖిల్ చేతిలో 5 ప్రాజెక్ట్స్ ఉండగా.. వాటిలో నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అవ్వడం గమనార్హం.
ఇక వీటిలో ముందుగా స్పై (Spy) అనే చిత్రాన్ని పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు తీసుకు రావడానికి సిద్ధం చేశాడు. ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ (Subhas Chandrabose) కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ మూవీ పై క్యూరియాసిటీని కలుగజేసింది. ఇక ఈ సినిమా తరువాత ఒక ఫాంటసీ డ్రామాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ‘స్వయంభు’ అనే టైటిల్ ని పెట్టుకున్న ఈ మూవీలో నిఖిల్ ఒక యోధుడిగా కనిపించబోతున్నాడు.
Nikhil Siddhartha : నిఖిల్ మరో పాన్ ఇండియా మూవీ.. ‘స్వయంభు’ ఫస్ట్ లుక్ పోస్టర్!
ఈ చిత్రం తరువాత రామ్ చరణ్ (Ram Charan) నిర్మాణంలో ఓకే చేసిన సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇటీవల ఈ మూవీ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ మూవీ కూడా మరో ఫ్రీడమ్ ఫైటర్ ‘వీర్ సావర్కర్’ కథాంశంతో వస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ‘ది ఇండియన్ హౌస్’ అనే టైటిల్ ని పెట్టారు. దీంతో ఈ మూవీ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కార్తికేయ ఫ్రాంచైజ్ లో మూడో బాగానే కూడా తీసుకు రాబోతున్నాడు. ఈ నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో పాటు.. తనకి స్వామి రారా, కేశవా వంటి హిట్స్ అందించిన సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు.