Nikhil Siddhartha : ‘స్పై’ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే రిలీజ్ చేశారు.. నిఖిల్ అసహనం..

స్పై మూవీ ఫెయిల్యూర్ పై నిఖిల్ మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశాడు. ఇంకా పది రోజులు షూటింగ్ చేయాల్సి ఉంది. కానీ..

Nikhil Siddhartha : ‘స్పై’ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే రిలీజ్ చేశారు.. నిఖిల్ అసహనం..

Nikhil Siddhartha Spy movie released without completing total shoot

Updated On : October 25, 2023 / 9:49 PM IST

Nikhil Siddhartha : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా విజయం అందుకున్న తరువాత.. మరోసారి పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసిన మూవీ ‘స్పై’. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యాల గురించి చెబుతాను అంటూ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన ఈ సినిమాలో.. అసలు ఆ పాయింటే లేకపోవడంతో ప్రేక్షకులకు విసుగు వచ్చింది. దీంతో మూవీని బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ చేశారు. ఇక ఈ ఫెయిల్యూర్ పై నిఖిల్ మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశాడు.

నిఖిల్ కామెంట్స్.. “స్పై మూవీ విషయంలో చాలా తప్పులు జరిగాయి. షూటింగ్ కూడా మొత్తం పూర్తి అవ్వలేదు. ఇంకా పది రోజులు షూటింగ్ చేయాల్సి ఉంది. కానీ అది చేయకుండానే సినిమాని రిలీజ్ చేశారు. ఈ విషయం నాకు కోపం తెప్పించింది. నా ఫ్యూచర్ సినిమాల్లో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను” అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో కూడా నిఖిల్ కి సమాచారం ఇవ్వకుండానే సాంగ్ ని నిర్మాతలు రిలీజ్ చేసేశారు. అప్పుడు కూడా ఈ గొడవ బయటకి వచ్చింది.

Also read : Anchor Suma : విలేకర్లు, యాంకర్ సుమ మధ్య గొడవ.. సారీ చెప్పిన వీడియో వైరల్..

కాగా నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ ని లైన్ పెట్టాడు. భరత్ కృష్ణమాచారి డైరెక్షన్ లో ‘స్వయంభు’ అనే సినిమా, రామ్ చరణ్ నిర్మాణంలో ‘ది ఇండియా హౌస్’ అనే సినిమా, ఆ తరువాత కార్తికేయ 3 మూవీ చేయనున్నాడు. ప్రస్తుతం నటిస్తున్న స్వయంభు సినిమా సోషియో ఫాంటసీ డ్రామాతో రాబోతుందట. బాలకృష్ణ ‘భైరవ ద్వీపం’ సినిమా తరహాలో స్వయంభు ఉండబోతుందంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలు కాబోతున్నట్లు వెల్లడించాడు.