Spy Movie : నిఖిల్ ‘స్పై’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్.. రిలీజ్‌కి ముందే ప్రాఫిట్స్‌లో..
కార్తికేయ 2 తర్వాత నిఖిల్ మార్కెట్ కూడా పెరిగింది. దీంతో స్పై సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగింది. స్పై సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ (ఓటీటీ, శాటిలైట్) రైట్స్ కలిపి దాదాపు 18 కోట్లు వచ్చినట్టు సమాచారం. స్పై సినిమాని 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక థియేట్రికల్ రైట్స్..

Nikhil Spy Movie Pre Release Business Details
Nikhil Spy : నిఖిల్ సిద్దార్థ(Nikhil Siddhartha) కార్తికేయ 2(Karthikeya 2), 18 పేజెస్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమా ‘స్పై’ తో రాబోతున్నాడు. ఐశ్వర్య మీనన్(Iswarya Menon) హీరోయిన్ గా, ఎడిటర్ గ్యారీ దర్శకుడిగా ఈ సినిమా భారీగా తెరకెక్కింది, నిఖిల్ ‘స్పై’(SPY) సినిమా జూన్ 29న పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుంది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కార్తికేయ 2 తర్వాత నిఖిల్ మార్కెట్ కూడా పెరిగింది. దీంతో స్పై సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగింది. స్పై సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ (ఓటీటీ, శాటిలైట్) రైట్స్ కలిపి దాదాపు 18 కోట్లు వచ్చినట్టు సమాచారం. స్పై సినిమాని 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.
ఇక థియేట్రికల్ రైట్స్..
నైజాం – 5.4 కోట్లు
సీడెడ్ – 2.2 కోట్లు
ఆంధ్ర – 6 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 5.4 కోట్లు
ఓవర్సీస్ – 2.7 కోట్లకు అమ్ముడయింది స్పై సినిమా. అంటే మొత్తంగా నిఖిల్ స్పై సినిమా 21.7 కోట్లకు అమ్ముడయింది. దీంతో సినిమా రిలీజ్ కి ముందే ప్రాఫిట్ జోన్ లో ఉంది. స్పై సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 22 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేయాలి. అంటే దాదాపు 40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాలి. అయితే స్పై పాన్ ఇండియా రిలీజ్ చేయడం. నిఖిల్ సినిమాలకు నార్త్ లో డిమాండ్ ఏర్పడటం, స్పై మీద అంచనాలు ఉండటంతో ఈ కలెక్షన్స్ ఈజీగానే వస్తాయని భావిస్తున్నారు.
Sai Kabir : సినిమా రిలీజ్‌కి ముందు డ్రగ్స్‌కి అడిక్ట్ అయి.. రిహాబిటేషన్ సెంటర్లో చేరిన డైరెక్టర్