అనుష్క నట విశ్వరూపం ‘నిశ్శబ్దం’..

  • Published By: sekhar ,Published On : September 21, 2020 / 01:28 PM IST
అనుష్క నట విశ్వరూపం ‘నిశ్శబ్దం’..

Updated On : September 21, 2020 / 1:39 PM IST

Nishabdham Trailer: తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిశ్శబ్దం/సైలెన్స్ చిత్రం ట్రైలర్ సోమవారం విడుదల చేశారు.
సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో అనుష్క శెట్టి, ఆర్. మాధవన్ మరియు అంజలి ప్రధాన పాత్రల్లో నటించగా, షాలిని పాండే, సుబ్బరాజు మరియు శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు.


మైఖేల్ మాడ్సన్ (వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్, కిల్ బిల్, రిజర్వాయర్ డాగ్స్) ఈ చిత్రం ద్వారా భారతీయ సినిమా పరిశ్రమకు పరిచయమవుతున్నారు. మాటలురాని మరియు వినికిడి లోపం ఉన్న ఒక కళాకారిణి, ప్రముఖ మ్యుజీషియన్ అయిన ఆమె భర్త మరియు ఆమె బెస్ట్ ఫ్రెండ్ అదృశ్యం అయిన అంశంపై ఈ చిత్రం రూపొందినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అనుష్క, మాధవన్‌ల నటన, బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ బాగున్నాయి. మాటలురాని, వినికిడి లోపం కలిగిన పాత్రలో అనుష్క హావభావాలు చాలా బాగా పలికించింది.


కోన ఫిల్మ్ కార్పొరేషన్ సహకారంతో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మాణంలో, హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల కానుంది.
‘నిశ్శబ్దం’ ఫస్ట్ డే ఫస్ట్ స్ట్రీమ్ అక్టోబర్ 1 గురువారం రాత్రి 9:30 నుంచి తెలుగు, తమిళ్ భాషల్లో అందుబాటులోకి రానుండగా అక్టోబర్ 2 తెల్లవారు జామున 12 గంటల నుండి మలయాళ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది.