Nitya Shetty : బాత్ రూమ్ వీడియో షేర్ చేసిన నిత్యా శెట్టి.. అభిమానులు హర్ట్!

చైల్డ్ ఆర్టిస్ట్ గా దేవుళ్ళు, అంజి వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నిత్యా శెట్టి.. తాజాగా బాత్ రూమ్ లో టవల్ తీసేస్తూ రచ్చ చేస్తున్న వీడియోని షేర్ చేసింది.

Nitya Shetty : బాత్ రూమ్ వీడియో షేర్ చేసిన నిత్యా శెట్టి.. అభిమానులు హర్ట్!

Nitya Shetty shared viral video fans are hurt

Updated On : April 22, 2023 / 6:47 PM IST

Nitya Shetty : ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన పలువురు హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తుంటారు. అలా టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన నటి నిత్యా శెట్టి. దేవుళ్ళు, అంజి వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నిత్యా.. చిన్నప్పుడే నటనలో రెండు నంది అవార్డులను సొంతం చేసుకుంది. ఇక హీరోయిన్ గా ‘నువ్వు తోపురా’ సినిమాతో ఆడియన్స్ ని పలకరించింది. అయితే ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత ‘ఓ పిట్టా కథ’ అనే థిల్లర్ మూవీలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

Ranbir Kapoor – Alia Bhatt : భార్య చెప్పులు మోసిన రణ్‌బీర్‌.. తప్పంటూ నెటిజెన్లు ట్రోల్.. రీజన్ ఏంటి?

ఆ సినిమాలో తన నటనకి విమర్శల ప్రశంసలు దక్కాయి. కానీ మరో హీరోయిన్ ఛాన్స్ తీసుకు రాలేక పోయింది. ఇటీవల పలు వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ ని సంపాదించుకోలేక పోయింది. దీంతో సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్ లు చేస్తూ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు చేసిన ఒక వీడియో సోషల్ మీడియా ఒక్కసారిగా హీటెక్కించేసింది. బాత్ రూమ్ లో టవల్ తీసేసి బాత్ టబ్ పడుకొని హాట్ ఫోజులు ఇస్తున్న బోల్డ్ వీడియోని షేర్ చేసింది.

Sarath Babu : సినీ నటుడు శరత్‌బాబు ఆరోగ్య పరిస్థితి.. లేటెస్ట్ అప్డేట్!

అయితే ఇప్పటి వరకు నిత్యా శెట్టి.. సినిమాల్లో, సోషల్ మీడియా ఫోటోషూట్ ల్లో చాలా పద్ధతిగా పక్కింటి అమ్మాయిలా కనిపించేది. సడన్ గా ఇటువంటి హాట్ వీడియోతో ఆడియన్స్ ముందుకు రావడంతో ఆమె ఫాలోవర్స్ హర్ట్ అయ్యారు. ‘బాబోయ్ ఏంటి అంది మీరు ఇలా చేస్తున్నారు’ అని కామెంట్ చేయగా, మరొకరు.. ‘నీకేం పోయేకాలం వచ్చిందే’ అంటూ ఘాటు రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Nitya Shetty (@nityashettyoffl)