NTR Finally Okays Buchchi Babu: బుచ్చిబాబుకు ఎట్టకేలకు తారక్ ఓకే చెప్పేశాడా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఉప్పెన ఫేం దర్శకుడు బుచ్చిబాబు సానా ఓ సినిమా చేయనున్నాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. అయితే ఈ సినిమాను తారక్ హోల్డ్‌లో పెట్టాడని.. అందుకే దీన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదని తెలుస్తోంది. కాగా, తాజాగా బుచ్చిబాబుకు తారక్ ఓకే చెప్పినట్లుగా మరో టాక్ వినిపిస్తోంది.

NTR Finally Okays Buchchi Babu: బుచ్చిబాబుకు ఎట్టకేలకు తారక్ ఓకే చెప్పేశాడా..?

NTR Finally Okays Buchchi Babu Movie

Updated On : August 30, 2022 / 7:53 PM IST

NTR Finally Okays Buchchi Babu: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాలను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ తన 30వ చిత్రాన్ని తెరకెక్కించనుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా తరువాత తారక్ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలతో పాటు మరో యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో కూడా తారక్ సినిమా చేయబోతున్నాడనే వార్త ఇటీవల ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపించింది.

Buchi Babu Sana: తారక్- బుచ్చిబాబు కాంబోలో సినిమా ఉంటుందా.. ఉండదా?

కానీ.. బుచ్చిబాబు చెప్పిన కథ తారక్‌ను పూర్తిగా శాటిస్ఫై చేయలేకపోయిందని.. అందుకే ఆయన బుచ్చిబాబు సినిమాను హోల్డ్‌లో పెట్టారనే టాక్ వచ్చింది. అయితే, ఇప్పుడు తాజాగా మరోసారి తారక్ బుచ్చిబాబు మూవీ గురించి ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. బుచ్చిబాబు తొలుత చెప్పిన కథలో తారక్‌ను రెండు విభిన్న పాత్రల్లో చూపించేందుకు ప్లాన్ చేశాడట. అయితే ఈ రెండు పాత్రల్లో ఒకటి 60 ఏళ్ల పాత్ర ఉంటుందట.. అది కూడా వీల్‌చైర్‌కే పరిమితం అయ్యి ఉంటుందట. ఈ అంశం తారక్‌కు నచ్చకపోవడంతో తిరిగి ఈ పాత్రను యాక్టివ్‌గా ఉండేలా మార్చాడట బుచ్చిబాబు.

NTR: ఎన్టీఆర్ కూడా ఆ డైరెక్టర్‌కే ఓటేశాడా..?

దీంతో తారక్‌కు బుచ్చిబాబు మార్చిన కథ బాగా నచ్చిందని, అందుకే ఆయన ఈ సినిమాకు ఓకే చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే బుచ్చిబాబు స్క్రిప్టును ఫైనల్ చేసి తారక్‌తో సినిమా కన్ఫం చేయబోతున్నాడనే టాక్ కూడా జోరుగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్‌ను పెట్టాలని బుచ్చిబాబు భావిస్తున్నాడట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.