War 2 : వార్ 2 సెట్స్ లో హృతిక్, తారక్.. వైరల్ అవుతున్న ఫొటో..

వార్ 2 సెట్స్ లోని హృతిక్, తారక్ ఫొటోలు నెట్టింట లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట..

War 2 : వార్ 2 సెట్స్ లో హృతిక్, తారక్.. వైరల్ అవుతున్న ఫొటో..

NTR Hrithik Roshan Photos leaked from War 2 movie sets

War 2 : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం యాష్ రాజ్ ఫిలిమ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతుంది. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకొని శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్స్ లోకి ఎన్టీఆర్ ఇటీవలే అడుగు పెట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అండ్ హృతిక్ కాంబోలో సీన్స్ ని చిత్రీకరిస్తున్నారు.

ఇక ఈ షూటింగ్ సెట్స్ నుంచి రెండు ఫొటోలు నెట్టింట లీక్ అయ్యాయి. ఆ పిక్స్ లో హృతిక్ అండ్ ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. హృతిక్ బులెట్ జాకెట్ ధరించి టీ తాగుతూ కనిపిస్తుంటే.. ఎన్టీఆర్ బ్లాక్ టి-షర్ట్ లో నడుస్తూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ ని నెట్టింట వైరల్ చేస్తూ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నారు.

Also read : Ram Gopal Varma : ఆదిపురుష్‌తో పోలిస్తే హనుమాన్ సూపర్ చీప్ ఫిలిం.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్..

అయితే ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్ర కొంత సమయమే ఉంటుంది. ఇక ఈ పాత్రకి సంబంధించిన సీన్స్ చిత్రీకరించడం కోసం ఎన్టీఆర్ 60 రోజుల డేట్స్ ని కేటాయించారట. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రని పరిచయం చేసిన మేకర్స్.. ఆ తరువాత ఆ పాత్రతో స్పై సినిమాటిక్ యూనివర్స్ లో ఓ మూవీని చేయనున్నారు. ఆల్రెడీ ఎన్టీఆర్ ఆ సినిమాకి కూడా సైన్ చేసేశారట.

ఈ సినిమాటిక్ యూనివర్స్ లో ఇప్పటివరకు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ హీరోలుగా కొనసాగుతూ వస్తున్నారు. కాగా వార్ 2 ని 2024 ఆగష్టు 14న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, శార్వరి హీరోయిన్స్ గా నటిస్తుంటే జాన్ అబ్రహం విలన్ గా కనిపించబోతున్నారు.