NTR: అమెరికాలో తారక్ అజ్ఞాతం.. ఎక్కడున్నాడో కూడా తెలియదట!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని దర్శకుడు కొరటాల శివతో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే NTR30 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. ఇక త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు కొరటాల అండ్ టీమ్ రెడీ అవుతుండగా, రీసెంట్‌గా తారక్ తన ఫ్యామిలీతో అమెరికాకు వెకేషన్‌పై వెళ్లాడు.

NTR: అమెరికాలో తారక్ అజ్ఞాతం.. ఎక్కడున్నాడో కూడా తెలియదట!

NTR Is Not Seen In His US Vacation

Updated On : December 23, 2022 / 4:28 PM IST

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని దర్శకుడు కొరటాల శివతో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే NTR30 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. ఇక త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు కొరటాల అండ్ టీమ్ రెడీ అవుతుండగా, రీసెంట్‌గా తారక్ తన ఫ్యామిలీతో అమెరికాకు వెకేషన్‌పై వెళ్లాడు.

NTR : ప్రేమ కౌగిళ్ళలో భార్యని బందిస్తున్న ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న పిక్!

అయితే స్టార్ హీరోలు ఎక్కడికైనా వెకేషన్‌పై వెళ్తే.. సాధారణంగా అక్కడి తెలుగు అభిమానులతో సందడి చేస్తుంటారు. వారు తమ కుటుంబంతో గడిపే క్షణాలను ఫోటోలుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంటారు. కానీ, తారక్ దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటాడు. తన ఫ్యామిలీకి సంబంధించి ఎక్కువగా ఎలాంటి విషయాలను బయటకు రానివ్వడు.

NTR30: తారక్ వేలిపై కొత్త బజ్.. ఎక్స్‌ట్రా ఉండటమే మంచిదట..?

ఇప్పుడు ఆయన యూఎస్ వెకేషన్‌కు వెళ్లాడనే విషయం తప్ప, ఆయన అమెరికాలో ఎక్కడ ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన అక్కడ ఏం చేస్తున్నాడనే విషయాలు ఎవ్వరికీ తెలియదు. దీంతో అమెరికాలోని తారక్ అభిమానులు ఆయన ఎక్కడ ఉంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.