సెన్సార్ టాక్ – ఎమోషనల్ ఎన్టీఆర్

గత కొద్ది రోజులుగా వాయిదా పడుతున్న కథానాయకుడు సెన్సార్ పనులు పూర్తయ్యాయి.

  • Published By: sekhar ,Published On : January 4, 2019 / 11:42 AM IST
సెన్సార్ టాక్ – ఎమోషనల్ ఎన్టీఆర్

గత కొద్ది రోజులుగా వాయిదా పడుతున్న కథానాయకుడు సెన్సార్ పనులు పూర్తయ్యాయి.

తన తండ్రి, స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథతో, ఆయన తనయుడు, నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు పేర్లతో రెండు పార్ట్‌‌లుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్  కథానాయకుడు రిలీజ్‌కి తక్కువ టైమ్ ఉండడంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది. బాలయ్య మీడియా ఛానెళ్ళకి ఇంటర్వూలవీ ఇస్తూ బిజీగా ఉన్నాడు. గత కొద్ది రోజులుగా వాయిదా పడుతున్న కథానాయకుడు సెన్సార్ పనులు, ఈరోజుతో పూర్తయ్యాయి. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా చూసిన సెన్సార్ టీమ్, ఎటువంటి కట్స్ చెప్పకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చింది.

ఎటువంటి విజువల్ కట్స్ కానీ, డైలీగ్స్ మ్యూట్ చెయ్యమని కానీ సెన్సార్ బోర్డ్ చెప్పకపోవడమే కాక, కథానాయకుడు టీమ్‌ని పొగడ్తలతో ముంచెత్తారట. బాలయ్య, అచ్చుగుద్దినట్టు ఎన్టీఆర్‌లా ఉన్నాడని, పెద్దాయన తెర వెనక జీవితం, సినిమా జీవితం, రాజకీయ ప్రవేశం వంటి అంశాలను చక్కగా చూపించారనీ, ఎన్టీఆర్ ఒక ఎమోషనల్ జర్నీ, ప్రేక్షకులకు తెలియని చాలా విషయాలు సినిమాలోఉన్నాయని చెప్పారు. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ చక్కగా సరిపోయింది. మిగతా ఆర్టిస్ట్‌లందరూ కూడా పాత్రలకి న్యాయం చేసారని,

ఈ సినిమా  తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుందని సెన్సార్ సభ్యులు చెప్పడంతో, మూవీ యూనిట్ చాలా హ్యాపీగా ఫీలయ్యారట. జనవరి 8నుండి యూ.ఎస్.లో భారీగా ప్రీమియర్స్ పడబోతుండగా, జనవరి 9న   
ఎన్టీఆర్ కథానాయకుడు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

వాచ్ రిలీజ్ ప్రోమో…