తారక్ రియాలిటీ షో ఎలా ఉండబోతోంది?..

NTR Re-Entry: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెర మీద సందడి చెయ్యబోతున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 తో తారక్ హోస్ట్ అవతారమెత్తారు. తన స్పాంటెనిటీ, ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్ డెలివరీతో పాటు తనదైన మేనరిజమ్‌తో మ్యాజిక్ చేశారు. తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియని బిగ్ బాస్ సీజన్ 1 ఇక్కడ అంతలా పాపులర్ కావడానికి ఎన్టీఆర్ యాంకరింగ్ బిగ్గెస్ట్ రీజన్ అని కొత్తగా చెప్పక్కర్లేదు.
కనిపించింది వారానికి రెండు రోజులే అయినా తనదైన శైలిలో అంతలా ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్నారు ఎన్టీఆర్. ఇప్పుడు మరోసారి బుల్లితెర ప్రేక్షకులను, తెలుగు అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. తెలుగులో పాపులర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌గా పేరొందిన జెమిని టీవీ తెలుగు ఆడియెన్స్ కోసం ఓ సరికొత్త రియాలిటీ షో ప్లాన్ చేసింది.
ఈ షో కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. జెమిని టీవీ యాజమాన్యం భారీ బడ్జెట్‌తో అత్యద్భుతంగా ఈ షో ను డిజైన్ చేశారట. ఈ షో ను హోస్ట్ చేస్తున్నందుకు గాను ఒక్క ఎపిసోడ్‌కి రూ. 30 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వనున్నారని సమాచారం. దాదాపు మూడున్నరేళ్ల తర్వాత తారక్ బుల్లితెరపై ఏ స్థాయిలో సందడి చేస్తాడోనని ప్రేక్షకాభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.