NTR – Devara : 35 రోజులు నీళ్ళల్లో.. 200 వాటర్ ట్యాంక్స్.. దేవరలో మైండ్ బ్లోయింగ్ యాక్షన్స్ కోసం ఎన్టీఆర్ కష్టం..
ఎన్టీఆర్ దేవర సినిమాలోని ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ గురించి మాట్లాడుతూ..

NTR
NTR – Devara : దేవర రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు మరిన్ని పెంచుతున్నారు. మూవీ టీమ్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ఇటీవల ముంబైలో దేవర ట్రైలర్ లాంచ్ తో పాటు సినిమా ప్రమోషన్స్ కూడా చేసారు. ఈ క్రమంలో ఎన్టీఆర్, దేవర టీమ్ సందీప్ రెడ్డి వంగతో స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
ఎన్టీఆర్ దేవర సినిమాలోని ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ గురించి మాట్లాడుతూ.. అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఒక స్టూడియోలో పెద్ద వాటర్ పూల్ తయారుచేసాము. 200 వరకు మ్యాన్ మేడ్ వాటర్ ట్యాంక్స్ ఏర్పాటు చేసాము. 35 రోజులు అండర్ వాటర్, వాటర్ లో షూట్ చేసాము. దేవరలో అదే ఇంపార్టెంట్ సీక్వెన్స్. సినిమాలో వాటర్ ఎలిమెంట్స్ చాలా వాడాము. ఆ యాక్షన్ సీక్వెన్స్ కోసం మోటార్ బోట్స్, అలలు రావడానికి మిషన్స్ ఇలా నిజంగా సముద్రంలో జరిగిన ఫైట్ లా కనిపించడానికి చాలా ఖర్చుపెట్టాము ఆ సీక్వెన్స్ మీద. ఆ సీన్స్ కోసం బాగా కష్టపడ్డాము. షార్క్ తో సీన్స్ అదిరిపోతాయి. ఓ 15 సెకండ్స్ సీన్ కి కూడా ఒక రోజంతా పట్టేది షూట్ లో. నీళ్ల లోపల చేసేటప్పుడు ఒక్కోసారి సరిగ్గా కనపడేది కాదు అని సినిమాలో వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్ గురించి చెప్పారు.
Also Read : NTR : అప్పుడు చాలా భయపడ్డాను.. దేవర ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ వ్యాఖ్యలు..
దీంతో దేవర సినిమాలో భారీ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుందని అందరూ భావిస్తున్నారు. ఈ సినిమాకు ఎన్టీఆర్ చాలా కష్టపడ్డాడు అని ఎన్టీఆర్ మాటల్లోనే తెలుస్తుంది. ఎన్టీఆర్ కష్టానికి తగ్గ ప్రతిఫలంగా దేవర ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి.