Simhadri : సింహాద్రి రీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?? థియేటర్స్ లో రచ్చ ఖాయం..

ఇటీవల వరుసగా స్టార్ హీరోల సినిమాలు, ఒకప్పుడు సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అభిమానులు వరుసగా తమ అభిమానుల సినిమాలను రీ రిలీజ్ చేయమని కోరడం, నిర్మాతలు కూడా కలెక్షన్స్ వస్తుండటంతో సినిమాలని రీ రిలీజ్ చేస్తున్నారు.

Simhadri : సింహాద్రి రీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?? థియేటర్స్ లో రచ్చ ఖాయం..

NTR Simhadri Movie Re Releasing in Theaters

Updated On : April 12, 2023 / 9:02 AM IST

Simhadri :  ఎన్టీఆర్(NTR) కెరీర్ లో మొదటి భారీ హిట్, ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన సినిమా సింహాద్రి(Simhadri). రాజమౌళి(Rajamouli) – ఎన్టీఆర్ కాంబోలో ఎన్టీఆర్ 7వ సినిమాగా వచ్చిన సింహాద్రి భారీ విజయం సాధించింది. 8 కోట్లతో ఈ సినిమాని తెరకెక్కిస్తే ఏకంగా 25 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇది రాజమౌళి – ఎన్టీఆర్ కాంబోలో రెండో సినిమా. ఈ సినిమా విజయంతో ఎన్టీఆర్ స్టార్ హీరోగా మారిపోయారు తెలుగు ఇండస్ట్రీలో. ఇప్పుడు సింహాద్రి సినిమా మళ్ళీ రీ రిలీజ్(Re Release) కాబోతుంది.

ఇటీవల వరుసగా స్టార్ హీరోల సినిమాలు, ఒకప్పుడు సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అభిమానులు వరుసగా తమ అభిమాన హీరో సినిమాలను రీ రిలీజ్ చేయమని కోరడం, నిర్మాతలు కూడా కలెక్షన్స్ వస్తుండటంతో సినిమాలని రీ రిలీజ్ చేస్తున్నారు. రీ రిలీజ్ లకు థియేటర్స్ లో మంచి స్పందన వస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ బాద్ షా, అదుర్స్ సినిమాలు రీ రిలీజ్ అయి సందడి చేశాయి.

NMACC : ఘనంగా ప్రారంభమైన నీతా ముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌.. భారత కళల కోసం అంబానీ అడుగు..

ఇప్పుడు ఎన్టీఆర్ సింహాద్రి రీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని 4K వర్షన్ లోకి మార్చామని ఇటీవల పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సింహాద్రి సినిమాని ఏప్రిల్ 9న రీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సింహాద్రి రీ రిలీజ్ తో మరోసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్స్ లో రచ్చ చేయబోతున్నారు.