తారక్ 30 – ‘‘అయినను పోయి రావలెను హస్తినకు’’
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కబోయే సినిమాకు ఆసక్తికరమైన టైటిల్..

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కబోయే సినిమాకు ఆసక్తికరమైన టైటిల్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ‘అరవింద సమేత’ తర్వాత ఓ సినిమా తెరకెక్కనుందని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కలిసి ఈ సినిమాను నిర్మించనున్నాయట.
తారక్ సరసన కథానాయికలుగా పూజా హెగ్డే, నివేధా పేతురాజ్, కియారా అద్వాణీ పేర్లు వినిపిస్తున్నాయి. ఫస్ట్ టైమ్ త్రివిక్రమ్ ఒక సోషల్ ఎలిమెంట్ తీసుకుని కథ రెడీ చేశాడట. ఈ సినిమా కోసం ‘‘అయినను పోయి రావలెను హస్తినకు’’ అనే టైటిల్ ఫిలిం చాంబర్‌లో రిజిష్టర్ చేయించారని తెలుస్తోంది. ఇది ఎన్టీఆర్ 30వ సినిమా కావడం విశేషం.
సంగీత దర్శకుడిగా థమన్ ఫిక్స్ అయినట్టు సమాచారం. తారక్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగుతో బిజీగా ఉన్నాడు. ఈ నెల 20 నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవనుంది. త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. కొద్ది విశ్రాంతి అనంతరం తారక్‌తో చేయబోయే సినిమాకు సంబంధించిన కథ ఫైనల్ వెర్షన్ రెడీ చేస్తారని ఫిలిం నగర్ వర్గాల వారు అంటున్నారు.