Chatrapathi Remake : ఎట్టకేలకు సప్నని పరిచయం చేసిన ఛత్రపతి..
బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న సినిమా ఛత్రపతిలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అని ఇప్పటి వరకు తెలియజేయలేదు. తాజాగా శ్రీనివాస్ తన హీరోయిన్ ని పరిచయం చేశాడు.

Nushrratt Bharuccha is heroine in Bellamkonda Sreenivas Chatrapathi Remake
Chatrapathi Remake : టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న సినిమా ఛత్రపతి. 2005 లో రాజమౌళి, ప్రభాస్ కలయికలో వచ్చిన ఛత్రపతికి ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇక అల్లుడు శీను సినిమాతో తనకి టాలీవుడ్ లో గ్రాండ్ డెబ్యూట్ అందించిన వి వి వినాయక్ ని తన బాలీవుడ్ డెబ్యూట్ కోసం కూడా ఎంచుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇటీవలే ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఆ టీజర్ కి బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
HanuMan : ఇండియన్ సూపర్ హీరో వచ్చేస్తున్నాడు.. హనుమాన్ షూటింగ్ పూర్తి..
ప్రభాస్ పాత్రకి బెల్లంకొండ కరెక్ట్ గా సెట్ అయ్యాడని, వినాయక్ కూడా కమ్‌బ్యాక్ ఇచ్చాడని టాలీవుడ్ ఆడియన్స్ కామెంట్స్ చేశారు. దీంతో చిత్ర యూనిట్ మూవీ విజయం పై నమ్మకంగా ఉన్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అన్నది తెలియజేయలేదు. నుష్రత్ బరుచా (Nushrratt Bharuccha) శ్రీనివాస్ సరసన నటించబోతుంది అంటూ బాలీవుడ్ వార్తలు వినిపించిన చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. తాజాగా బెల్లంకొండ తన హీరోయిన్ పరిచయం చేశాడు.
బాలీవుడ్ వార్తలు వినిపించిన నుష్రత్ బరుచానే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ‘మీట్ ఛత్రపతి సప్న’ అంటూ నుష్రత్ తో శ్రీనివాస్ స్టిల్ ఫోటోని రిలీజ్ చేశారు. తనిష్క్ బాఘ్చి (Tanishk Bagchi) ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మే 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా మంచి డెబ్యూట్ హిట్టు అందుకుంటాడా? లేదా? చూడాలి. కాగా శ్రీనివాస్ తెలుగులో సాగర్ కే చంద్రతో ఓ సినిమా ఒకే చేశాడు. భీమ్లా నాయక్ వంటి సక్సెస్ తరువాత సాగర్, శ్రీనివాస్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు.
Meet Chatrapathi’s SAPNA! @Nushrratt
.
.#ChatrapathiOnMay12th @bhagyashree123 @SharadK7 @Penmovies #JayantilalGada #PenStudios #PenMarudhar #TanishkBagchi @TimesMusicHub #Bss9 pic.twitter.com/EIHLPe0x6W— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) April 17, 2023