Nuvvostanante Nenoddantana: వాలెంటైన్స్ డే స్పెషల్.. మళ్లీ వస్తున్న బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ!

టాలీవుడ్‌లో ఇటీవల రీ-రిలీజ్‌ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద రీ-రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలను మళ్లీ థియేటర్లలో చూసేందుకు ఆడియెన్స్ కూడా ఆసక్తిని చూపుతుండటంతో ఈ సినిమాలకు అనుకున్న స్థాయికంటే ఎక్కువ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ జాబితాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జల్సా, మహేష్ బాబు పోకిరి వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలు కూడా ఉన్నాయి.

Nuvvostanante Nenoddantana: వాలెంటైన్స్ డే స్పెషల్.. మళ్లీ వస్తున్న బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ!

Nuvvostanante Nenoddantana To Re-Release As Valentines Day Special

Nuvvostanante Nenoddantana: టాలీవుడ్‌లో ఇటీవల రీ-రిలీజ్‌ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద రీ-రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలను మళ్లీ థియేటర్లలో చూసేందుకు ఆడియెన్స్ కూడా ఆసక్తిని చూపుతుండటంతో ఈ సినిమాలకు అనుకున్న స్థాయికంటే ఎక్కువ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ జాబితాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జల్సా, మహేష్ బాబు పోకిరి వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలు కూడా ఉన్నాయి.

Trisha: త్రిష కొత్త మూవీ.. నెలలోపే అందులో ప్రత్యక్షం..!

ఇక తాజాగా మరో బ్లాక్‌బస్టర్ మూవీ రీ-రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రేమికుల రోజును పురస్కరించుకుని, ఫిబ్రవరి 14న సిద్ధార్థ్-త్రిషల రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘‘నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా..!’’ రీ-రిలీజ్ కానుంది. ఈ సినిమాను ప్రభుదేవా డైరెక్ట్ చేయగా, ఈ సినిమాలో రియల్ స్టార్ శ్రీహరి కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా 2005లో రిలీజ్ కాగా, బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా ఇప్పటికీ బుల్లితెరపై టెలికాస్ట్ అయితే, ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోవడం మనం చూస్తుంటాం.

దీంతో ఈ సినిమాను వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఏకంగా 9 భాషల్లో రీమేక్ అయ్యి, అత్యధిక భాషల్లో రీమేక్ అయిన సినిమాగా నిలిచింది. మరి ఈ సినిమా రీ-రిలీజ్‌కు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.