OG Movie : పవన్ లేకుండానే జరుగుతున్న OG షూటింగ్.. 50 డేస్..!
OG మూవీ నుంచి అప్డేట్ ఇచ్చిన డిఓపి రవి కే చంద్రన్. పవన్ లేకుండానే షూటింగ్ జరుగుతుంది..!

OG Movie new schedule is going on without Pawan Kalyan
OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా OG. ప్రభాస్ సాహూ తెరకెక్కించిన సుజిత్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ షెడ్యూల్ పవన్ లేకుండానే జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ ఇప్పటివరకు 50 రోజులు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రవి కే చంద్రన్ ఒక పోస్ట్ వేశాడు.
Namrata : మహేష్ తనయుడు ‘గౌతమ్’ సినిమా ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన నమ్రతా.. ఆ తరువాతే హీరోగా..!
ఈ పోస్ట్ చూస్తుంటే ఈ మూవీ షూటింగ్ పవన్ లేకున్నా జరుగుతున్నట్లు అర్ధమవుతుంది. కాగా ఇప్పటికే మూడు షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు నాలుగో షెడ్యూల్ మొదలు పెట్టుకుంది. మరి ఈ షెడ్యూల్ పవన్ జాయిన్ అవుతాడా? లేదా పవన్ లేకుండానే ఈ షెడ్యూల్ పూర్తి అవుతుందా? అనేది చూడాలి. ప్రస్తుతం పవన్ వారాహి యాత్రలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ మొదటి షెడ్యూల్ ముంబైలో జరిగింది. అక్కడ యాక్షన్ అండ్ హీరోహీరోయిన్ల మధ్య సన్నివేశాలు తెరకెక్కించినట్లు తెలుస్తుంది.
Bhagavad Gita : ఆ పాత్రని అర్ధం చేసుకోవడం కోసం భగవద్గీత చదివాను.. హాలీవుడ్ నటుడు సిలియన్ మర్ఫీ!
We have completed 50 days of the #OG shoot. ❤️?#FireStormIsComing ??#TheyCallHimOG ?? https://t.co/ZHvwPfGOPI
— DVV Entertainment (@DVVMovies) July 16, 2023
ఆ తరువాత రెండు షెడ్యూల్స్ హైదరాబాద్ లోని ఒక ప్రత్యేక సెట్ లో జరిగాయి. ఇప్పుడు నాలుగో షెడ్యూల్ కూడా హైదరాబాద్ లోనే జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమిళ్ స్టార్ యాక్టర్స్ అర్జున్ దాస్ (Arjun Das), శ్రియారెడ్డి (Sriya Reddy) తో పాటు బాలీవుడ్ రొమాంటిక్ స్టార్ ఇమ్రాన్ హష్మి (Emraan Hashmi) విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.