RRR థీమ్.. స్వరూపాలు, స్వభావాలు వేరైనా ప్రయత్నం మాత్రం ఒకటే!

ఒక వైపు మన్నెందొర, మరో వైపు గోండు ముద్దు బిడ్డ. ఒక వైపు నీరు, మరో వైపు నిప్పు. ఒక వైపు కణకణ మండే నిప్పుకణం, మరో వైపు ఉవ్వెత్తున ఎగసిపడే సముద్రం. రెండు స్వరూపాలు స్వభావాలు వేరైనా..

Two Different Run Time For Telugu And Hindi Versions Of Rrr

RRR: ఒక వైపు మన్నెందొర, మరో వైపు గోండు ముద్దు బిడ్డ. ఒక వైపు నీరు, మరో వైపు నిప్పు. ఒక వైపు కణకణ మండే నిప్పుకణం, మరో వైపు ఉవ్వెత్తున ఎగసిపడే సముద్రం. రెండు స్వరూపాలు స్వభావాలు వేరైనా రెండింటి ప్రయత్నం మాత్రం ఒకటే. అచ్చం ఇలానే ఉన్నారు ఈ ఇద్దరు హీరోలు. అభిమానులు ఎన్నో కళ్లతో ఎదురుచూస్తున్న ఆ ఇద్దర్నీ తగ్గేదే లే అంటూ సినిమాలో అద్బుతంగా తీర్చిదిద్దారు రాజమౌళి.

RRR: 4 ఏళ్ల క్రితం ఆలోచన.. కొద్ది గంటల్లో బిగ్ స్క్రీన్ మీద ట్రిపుల్‌ఆర్!

ట్రిపుల్ఆర్ లో ఇద్దరు స్టార్ హీరోలు.. ఎవరిని ఎలా చూపిస్తారో అని డౌట్ పడిన ఆడియన్స్ కి డబుల్ ఫీస్ట్ ఇచ్చారు రాజమౌళి. ఎన్టీఆర్, చరణ్ క్యారెక్టర్స్ ని రివీల్ చేస్తూ.. రాజమౌళి రిలీజ్ చేసిన టీజర్లతో ఇద్దరు ఫాన్స్ పండగ చేసుకున్నారు. రామ్ చరణ్ తన టీజర్ లో క్యారెక్టర్ లో అగ్రెషన్ కి సింబాలిక్ గా నిప్పును చూపిస్తూ.. ఆడియన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు. అటు మన్నెందొర అల్లూరి సీతారామరాజుగా గురి చెక్కుచెదరకుండా విల్లుతో విన్యాసాలు చేస్తూన్నారు. మరో వైపు పోలీస్ క్యారెక్టర్ లో ఫిట్ గా వర్కవుట్స్ చేస్తూ.. అంతే పవర్ ఫుల్ ఎనర్జీతో అగ్రెసివ్ యాటిట్యూడ్ తో మరో షేడ్ లో చరణ్ ని చూపించారు రాజమౌళి.

RRR: కొన్ని గంటల్లోనే ఆర్ఆర్ఆర్.. ప్లస్, మైనస్ అంశాలివే!

కొమురంభీమ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎన్టీఆర్ కూడా అల్లూరికి ఏమాత్రం తగ్గకుండా తన స్టామినాని చూపించారు రాజమౌళి. అల్లూరికి నిప్పును చూపిస్తే.. ఎన్టీఆర్ క్యారెక్టర్ స్పీడ్ కి తగినట్టు నీటిని చూపించారు. కనబడితే సముద్రాలు తడబడతాయ్ అంటూ ఉవ్వెత్తున ఎగిసి పడే కెరటాన్ని అద్బుతంగా చూపించారు.

RRR: టార్గెట్ 2 వేల కోట్లు.. ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా ట్రిపుల్‌ఆర్?

స్టార్ కాస్ట్ సెలక్షన్ దగ్గరనుంచి సినిమా రిలీజ్ వరకూ తన రేంజ్ ని తన మార్క్ ని ప్రతి విషయంలో చూపిస్తూనే ఉన్నారు రాజమౌళి. రిలీజ్ ఎన్ని సార్లు పోస్ట్ పోన్ అయినా.. సినిమా మీద కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్లారు జక్కన్న. ఆడియన్స్ కి కావల్సిన ఎలిమెంట్స్ అన్నింటినీ అందించడానికి ఏమాత్రం వెనకాడని రాజమౌళి అదే పర్ ఫెక్షన్ తో, అదే ప్రేమతో గ్రాండ్ గా నెవర్ బిఫోర్ రిలీజ్ తో మార్చి 25న ట్రిపుల్ఆఱ్ తో మరో సారి ప్రేక్షకుల మనసు గెలచుకోడానికి, టాలీవుడ్ స్టామినాని వరల్డ్ వైడ్ గా చూపించడానికి రెడీ అవుతున్నారు.