బాలయ్యా మజాకా : సెకండ్ సాంగ్‌లో చెలరేగిపోయాడు!
నటసింహ నందమూరి బాలకృష్ణ ‘రూలర్’ సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్..

నటసింహ నందమూరి బాలకృష్ణ ‘రూలర్’ సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్..
నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ‘రూలర్’.. వేదిక, సోనాల్ చౌహాన్ కథానాయికలు.. ప్రకాష్ రాజ్, జయసుధ, భూమికా చావ్లా కీలకపాత్రల్లో నటించారు. ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్ అండ్ ‘అడుగడుగో యాక్షన్ హీరో’ సాంగ్ ఆకట్టుకుంటున్నాయి. బుధవారం సాయంత్రం సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
చిరంతన్ భట్ కంపోజ్ చేసిన ట్యూన్‌కి భాస్కరభట్ల లిరిక్స్ రాయగా.. సింహా, చాందిని విజయ్ కుమార్ షా కలిసి పాడారు. ‘ఎర ఎర్రా ఎర ఎర్రా.. నా పెదవుల్ని ముద్దాడుకోరా.. గిర గిర్రా గిర గిర్రా తిరిగేస్తుంటే నను చూడవేరా.. హే సర్రా సర్రా సర్రా.. తెగ నచ్చేశావు కుర్రా.. హే జర్రా జర్రా జర్రా నా నడుమే జీలకర్ర.. ఖర్చీఫే ఏస్కో జల్దీ జల్దీగా… పడతాడు తాడు తాడు ఎవడైనా.. మగవాడు వాడు వాడు ఎవడైనా’ అంటూ సాగే పాట ఫుల్ జోష్‌తో ఆకట్టుకుంటోంది.
బాలయ్య, సోనాల్‌పై విదేశాల్లో షూట్ చేసిన ఈ పాటలో బాలయ్య డ్యాన్స్ ఇరగదీశాడని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ‘పడతాడు తాడు’ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.. ‘జైసింహా’ తర్వాత బాలయ్య, కె.ఎస్.రవికుమార్ కలయికలో వస్తున్న ‘రూలర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 14న వైజాగ్‌లో ఘనంగా జరుగనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ‘రూలర్’ ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. సంగీతం : చిరంతన్ భట్, కెమెరా : సి.రామ్ ప్రసాద్, నిర్మాత : సి.కళ్యాణ్.