Allu Arjun : అమెరికాలో అల్లు అర్జున్ కి పాలాభిషేకాలు.. షాక్ లో అమెరికన్స్..

అమెరికాలోని చికాగోలో పుష్ప 2 సినిమా రిలీజ్ కావడంతో అక్కడి బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హంగామా చేశారు.

Allu Arjun : అమెరికాలో అల్లు అర్జున్ కి పాలాభిషేకాలు.. షాక్ లో అమెరికన్స్..

Palabhishekam for Allu Arjun in America video goes viral

Updated On : December 7, 2024 / 3:56 PM IST

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 సినిమా వైల్డ్ గా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. విడుదలైన మొదటి రోజు నుండే కాసుల వర్షం కురిపిస్తుంది. ఉహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ లో మునిగి తేలుతున్నారు బన్నీ ఫ్యాన్స్. పుష్ప 2 రిలీజ్ కాకముందు నుండే నెక్స్ట్ లెవెల్ లో సెలబ్రేషన్స్ చేసిన ఫ్యాన్స్ హిట్ అయ్యాక ఆగుతారా.

Also Read : Pushpa 3 : పుష్ప 3 ఇప్పట్లో లేనట్టేనా.. ఆరేళ్ళ తర్వాతేనా..?

ఇక బన్నీ కి వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమెరికాలోని చికాగోలో పుష్ప 2 సినిమా రిలీజ్ కావడంతో అక్కడి బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హంగామా చేశారు. థియేటర్స్ ముందు బన్నీ కటౌట్ కి పాలతో అభిషేకం చేశారు. అంతే కాదు ‘రాజులకే రాజు పుష్ప రాజు’ అనే నినాదాలతో బన్నీ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇక బన్నీ పై ప్రేమతో బాంబులు కాలుస్తూ, పాలతో అభిషేకం చెయ్యడం చూసిన అక్కడి అమెరికన్స్ షాక్ అయ్యారు.


నిజానికి తెలుగు సినీ హీరోల అభిమానులు వారిపై ఉన్న అభిమానం చూపించడానికి ఎంతకైనా తెగిస్తారు అని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో తమ అభిమాన హీరో సినిమా వస్తుదంటే చాలు పండగ చేసుకుంటుంటారు. అన్నదానాలు, రక్తదానాలు ఇలా ఎన్నో రకాల పనులు చేసి తమపై ఉన్న అభిమానాన్ని చూపిస్తారు. ఇంకొందరైతే కాలి నడకన ఎక్కడినుండో వస్తుంటారు. ఇక ఇప్పుడు అమెరికాలో ఉన్న బన్నీ ఫ్యాన్స్ సైతం ఇదే చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతుంది.