Akhanda 2: అఖండ 2 కోసం రంగంలోకి మిశ్రా ద్వయం.. ఇక బీజీఎమ్ తో పూనకాలు గ్యారంటీ.. స్పీకర్లు జాగ్రత్త..

తమన్.. ప్రస్తుతం ఈ పేరు చెప్తే స్పీకర్స్ పగిలిపోతున్నాయి. ఎక్కడ చూసినా(Akhanda 2), విన్నా మనోడి మ్యూజిక్ గురించే చర్చ. ఆ రేంజ్ లో తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్నాడు తమన్.

Akhanda 2: అఖండ 2 కోసం రంగంలోకి మిశ్రా ద్వయం.. ఇక బీజీఎమ్ తో పూనకాలు గ్యారంటీ.. స్పీకర్లు జాగ్రత్త..

Pandit Shravan Mishra and Pandit Atul Mishra singing for the movie Akhanda 2

Updated On : October 13, 2025 / 6:43 AM IST

Akhanda 2: తమన్.. ప్రస్తుతం ఈ పేరు చెప్తే స్పీకర్స్ పగిలిపోతున్నాయి. ఎక్కడ చూసినా, విన్నా మనోడి మ్యూజిక్ గురించే చర్చ. ఆ రేంజ్ లో తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్నాడు తమన్. రీసెంట్ గా వచ్చిన ఓజీ సినిమాతో తమన్ మ్యూజిక్ మ్యానియా(Akhanda 2) పీక్స్ కి చేరుకుంది. ఓజీ సినిమాని తన ఎలక్ట్రిఫయింగ్ మ్యూజిక్ తో నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి, ఓజీ సినిమాలో చెప్పుకోడానికి అంతగా ఎం లేదు. జస్ట్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, సుజీత్ టేకింగ్, తమన్ మ్యుజిక్ కలిపి సినిమాని బ్లాక్ బస్టర్ అయ్యేలా చేశాయి.

Sai Durga Tej: అల్లు అర్జున్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్.. నాకు చాలా గర్వంగా ఉంది: సాయి దుర్గ తేజ్

ఈ సినిమా తరువాత అందరి చూపు తమన్ నెక్స్ట్ సినిమా అఖండ 2పైనే ఉన్నాయి. ఎందుకంటే, అఖండ సినిమాకు ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఏ రేంజ్ లో వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓపక్క మాస్ బీజీఎమ్ తో మెంటలెక్కిస్తూనే.. మరోపక్క డివోషనల్ మ్యూజిక్ తో ఆడియన్స్ ను ట్రాన్స్ లోకి తీసుకెళ్లాడు తమన్. అఖండ సినిమా విజయంలో కీలక పాత్ర అంటే తమన్ అనే చెప్పాలి. అంతటి క్రేజ్ ఉన్న అఖండ సీక్వెల్ కి అంతకుమించి అన్న రేంజ్ లో మ్యూజిక్ అందించాలని ప్లాన్ చేస్తున్నాడట తమన్.

అందులో భాగంగానే ఆడియన్స్ కి సరికొత్త ఫీలింగ్ కలిగించేలా మిశ్రా ద్వయాన్ని రంగంలోకి దించుతున్నాడు. ఈ మిశ్రా ద్వయం మరెవరో కాదు.. సంస్కృత శ్లోకాలు చెప్పడంలో నిష్ణాతులు పండిట్‌ శ్రవణ్‌ మిశ్రా, పండిట్‌ అతుల్‌ మిశ్రా. వీరి మంత్రోచ్ఛారణ వింటే ఎలాంటి వారికైనా పూనకం రావడం ఖాయం. వీరికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి వారిని ఇప్పుడు అఖండ 2 కోసం రంగంలోకి దించాడు తమన్. వీళ్లు పలికే సంస్కృత శ్లోకాలు, వేదమంత్రాలు అఖండ 2 బీజీఎమ్ ను మరింత స్పెషల్ గా మార్చబోతుందట. ఈ ఒక్క న్యూస్ తో అఖండ 2 సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఇక బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ 2 సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.