Parineeta Chopra: అనుకున్నదే అయ్యింది.. అతడితోనే పరిణీతి చోప్రా నిశ్చితార్థం..!

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో నిశ్చితార్థం చేసుకుంది. ఈ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Parineeta Chopra: అనుకున్నదే అయ్యింది.. అతడితోనే పరిణీతి చోప్రా నిశ్చితార్థం..!

Parineeta Chopra Engagement With Raghav Chadha

Parineeta Chopra Engagement: బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా గతకొంత కాలంగా ఆప్ ఎంపీ రాఘవ్ ఛద్దాతో ప్రేమాయణం కొనసాగిస్తుందనే వార్తలు బిటౌన్‌లో జోరుగా వినిపించాయి. అయితే, ఈ వార్తలపై అమ్మడు మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. దీంతో వారిద్దరి మధ్య ఏముందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులతో పాటు మీడియా కూడా ఆసక్తిగా చూసింది.

Parineeti Chopra : పెళ్ళికి పిలుస్తారా అంటూ ఫోటోగ్రాఫర్ ప్రశ్న.. సిగ్గుపడ్డ పరిణీతి, రాఘవ్ చద్దా.. వీడియో వైరల్!

అయితే, ఇటీవల సోషల్ మీడియాలో వీరి రిలేషన్ గురించి వచ్చిన వార్తలన్నింటినీ నిజం చేస్తూ తాజాగా ఈ జంట నిశ్చితార్థం చేసుకుంది. ఆప్ ఎంపీ రాఘవ్ ఛద్దాతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనుండటంతో అభిమానులతో పాటు వారి శ్రేయోభిలాషులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Parineeti Chopra : ఆప్ ఎంపీతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం.. నిజమేనా?

ఇక ఈ జంట తమ వివాహ వేడుకను ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరిణీతి చోప్రా ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్స్ ఆమెకు తమ విషెస్ తెలుపుతూ నెట్టింట ఈ బ్యూటీని ట్రెండింగ్ చేస్తున్నారు.