Parineeti Chopra : ఆప్ ఎంపీతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం.. నిజమేనా?
ముంబై వీధుల్లో గత కొంత కాలంగా చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్న హీరోయిన్ పరిణీతి చోప్రా, అప్ ఎంపీ రాఘవ్ చద్దా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట.

Parineeti Chopra Raghav Chadha Engaged on this saturday gone viral
Parineeti Chopra : బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా (Parineeti Chopra).. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాతో (Raghav Chadha) ప్రేమలో ఉంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో డిన్నర్, లంచ్ అంటూ రెస్టారెంట్స్ చుట్టూ తిరుగుతూ బాలీవుడ్ మీడియా లెన్స్ కి పలుమార్లు చిక్కారు. ఇటీవల ఐపీయల్ (IPL) మ్యాచ్ లో కూడా జంటగా వచ్చి సందడి చేశారు. అయితే ఈ విషయం పై మాత్రం ఈ జంట ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు.
Parineeti Chopra : IPL మ్యాచ్ లో సందడి చేసిన పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా.. ఫోటో వైరల్!
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వీరిద్దరి డేటింగ్ గురించి పరిణీతి చోప్రాని ప్రశ్నించగా.. ఆమె కొంచెం ఘాటు సమాధానమే చెప్పింది. “నేను ఎవరితో ఉంటున్నాను, ఎవరితో తిరుగుతున్నాను అనే విషయాలు మీకు అనవసరం. ఇది నా జీవితం. ఏదైనా ఉంటే నేనే చెబుతాను. కానీ ఆ సమయం వచ్చే వరకు చూడకుండా హద్దు ధాటి సెలబ్రేటిస్ లైఫ్ గురించి మాట్లాడం మంచి కాదు” అంటూ వ్యాఖ్యానించింది. అయితే తాజాగా వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ బి-టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
Parineeti Chopra : ఎంపీతో డేటింగ్ పై మొదటి సారి స్పందించిన పరిణీతి.. ఏమందో తెలుసా?
ఈ శనివారం (మే 13) వీరిద్దరి నిశ్చితార్థం జరగబోతున్నట్లు ముంబైలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుక ఢిల్లీలో జరగనున్నట్లు, ఇరు కుటుంబసభ్యులు, మిత్రులతో పాటు దాదాపు 150 మంది అతిథులు ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఇక పెళ్లి ముహుర్తాన్ని ఇంకా ఫైనల్ చేయనప్పటికీ, ఈ ఏడాది చివరిలో వీరిద్దరి పెళ్లి ఉండవచ్చని తెలుస్తుంది. అయితే ఈ నిశ్చితార్థం, పెళ్లి వార్తలు గురించి పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఈ వార్తలు నిజామా? లేక కేవలం పుకార్లేనా? తెలియాలి అంటే శనివారం వరకు ఎదురు చూడాల్సిందే.