Parineeti Raghav Wedding : ఘనంగా పరిణీతి చోప్రా – రాఘవ్ చద్దా వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు..

రాఘవ్ – పరిణీతి వివాహం 24 సెప్టెంబర్ 2023 ఆదివారం నాడు రాజస్ధాన్‌ ఉదయ్‌పూర్(Udaipur) లోని లీలా ప్యాలెస్ లో ఘనంగా జరిగింది.

Parineeti Raghav Wedding : ఘనంగా పరిణీతి చోప్రా – రాఘవ్ చద్దా వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Parineeti Chopra Raghav Chaddha got married in Udaipur Leela Palace

Parineeti Raghav Wedding :  గత కొన్నాళ్లుగా బాలీవుడ్(Bollywood) నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ప్రేమించుకొని ఇన్నాళ్లు చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ జంట నిన్న పెళ్లితో ఒక్కటి అయ్యారు. రాఘవ్ – పరిణీతి వివాహం 24 సెప్టెంబర్ 2023 ఆదివారం నాడు రాజస్ధాన్‌ ఉదయ్‌పూర్(Udaipur) లోని లీలా ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. రాఘవ్ – పరిణీతి ఫ్యామిలీలు, బంధువులతో పాటు పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు వీరి వివాహానికి హాజరయ్యారు.

Parineeti Chopra Raghav Chaddha got married in Udaipur Leela Palace

Also Read : Rekha Vedavyas : ఎందుకు ఇలా గుర్తు పట్టలేనంతగా మారిపోయిందంటే.. ఎమోషనల్ అవుతూ క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

ఉదయ్‌పూర్ లోని లీలా ప్యాలెస్ లో హల్దీ, సంగీత్, పెళ్లి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. రాఘవ్ – పరిణీతి పెళ్లి కోసం దాదాపు 90 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని సమాచారం. తాజాగా రాఘవ్ వీరి పెళ్లి ఫోటోలు షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అభిమానులు, పలువురు సినీ, రాజకీయా సెలబ్రిటీలు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.