Paruchuri Gopala Krishna : ఇలాంటి పాయింట్ పై సినిమా తీస్తే చూస్తారా అనే భయం ఉంటుంది.. బలగంపై పరుచూరి వ్యాఖ్యలు

తాజాగా బలగం సినిమా చూసిన ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆ సినిమాని అభినందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. బలగం సినిమా తీసిన వాళ్ళ గురించి మాట్లాడుతూ..........

Paruchuri Gopala Krishna : ఇలాంటి పాయింట్ పై సినిమా తీస్తే చూస్తారా అనే భయం ఉంటుంది.. బలగంపై పరుచూరి వ్యాఖ్యలు

Paruchuri Gopala Krishna comments on Balagam Movie

Updated On : April 10, 2023 / 10:56 AM IST

Paruchuri Gopala Krishna :  కమెడియన్ వేణు(Venu) దర్శకుడిగా మారి ప్రియదర్శి(Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) ముఖ్యపాత్రల్లో మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కించిన సినిమా బలగం(Balagam). దిల్ రాజు(Dil Raju) కూతురు హన్షిత రెడ్డి(Hanshitha Reddy) ఈ సినిమాని నిర్మించింది. చిన్న సినిమాగా రిలీజయి పెద్ద విజయం సాధించింది. కలెక్షన్స్ తో పాటు పేరు కూడా సంపాదించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై ప్రేక్షకులు, ప్రముఖుల నుంచి అభినందనలు వస్తున్నాయి. అలాగే అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికే పలు అవార్డులు గెలుచుకొని మరిన్ని అవార్డులకు పోటీల్లో నిలబడుతుంది.

తాజాగా బలగం సినిమా చూసిన ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆ సినిమాని అభినందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. బలగం సినిమా తీసిన వాళ్ళ గురించి మాట్లాడుతూ.. ఒక సినిమాకు ఏది బలమో అదే బలగం సినిమాలో ఉండి. ఈ సినిమాని తీస్తున్నప్పుడు ఇంత పెద్ద హిట్ అవుతుందని నిర్మాతలు దిల్ రాజు, హన్షిత, హర్షిత్ కూడా అనుకోని ఉండరు. స్టార్ హీరోలు, పెద్ద డైరెక్టర్స్ అవసరంలేదు కథని నమ్ముకుంటే సినిమా హిట్ అవుతుందని ఇది నిరూపించింది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ తెచ్చుకుంది. వేణుని జబర్దస్త్ కమెడియన్ గా చూశాను. అతనిలో ఇంత గొప్ప రచయిత, డైరెక్టర్ ఉన్నాడని నేను ఊహించలేదు.కామెడీ చేస్తున్న అబ్బాయి ఇలా గుండెలకు హత్తుకునే సినిమా చేయగలడు అనేది ఊహించలేము. ఇతను సినిమాలో చేసిన మెయిన్ ప్లస్ పాయింట్ సినిమాని చూసి ముందునుంచే ఏడిపించకుండా ముందు నవ్వించి, కవ్వించి ఆ తర్వాత కన్నీళ్లు పెట్టించడంతో వేణు డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు అని అన్నారు.

Keeravani : రామోజీరావు కోసమైనా ఆస్కార్ తీసుకురావాలి అనుకున్నా.. ఆస్కార్ కోసం 200 సార్లు RRR సినిమాని స్క్రీనింగ్ వేశాం..

ఇక బలగం కథ గురించి మాట్లాడుతూ.. ఒక సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోవడం నేను చాలా తక్కువ సినిమాలకు ఏడ్చాను. అందులో ఇప్పుడు బలగం ఒకటి. సాధారణంగా చాలా సినిమాల్లో కుటుంబం విడిపోతుంటే మనం కన్నీళ్లు పెట్టాం. కానీ ఈ సినిమాలో కుటుంబం కలుస్తుంటే ఏడుస్తాం. క్లైమాక్స్ లో అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత 11 రోజుల కార్యక్రమం, చావు, కర్మ, ఏడుపులు, పిండప్రదానం.. అసలు ఇలాంటి వాటిని కథగా తీసుకొని సినిమా చేస్తే ఇప్పుడు ఎవరు చూస్తారు అనే భయం ఉంటుంది. కానీ అలాంటి భయాలు లేకుండా వేణు ధైర్యంగా తీసి ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాడు. ఒక కుటుంబం విడిపోతే చనిపోయిన వారి ఆత్మ ఘోషిస్తుందని గొప్పగా చెప్పిన సినిమా. కచ్చితంగా అందరూ ఈ సినిమాని చూడండి. చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు, బలగం సినిమా చూసి కన్నీళ్లు పెట్టకపోతే నాకు మెసేజ్ చేయండి అని అన్నారు పరుచూరి గోపాలకృష్ణ.