పసల బేబీకి సినిమా ఛాన్స్: పాటకు ఫిదా  

  • Published By: veegamteam ,Published On : February 1, 2019 / 06:46 AM IST
పసల బేబీకి సినిమా ఛాన్స్: పాటకు ఫిదా  

Updated On : February 1, 2019 / 6:46 AM IST

హైదరాబాద్ : పల్లెకోయిల అంటు అందరు ముద్దుగా పిలుచుకునే బేబీ సినిమాలలో పాడే ఛాన్స్ కొట్టేశారు. బేబీకి మొదటిసారిగా  సినిమాలో పాడే అవకాన్ని సంగీత దర్శకుడు రఘు కుంచె ఇచ్చారు. “జీవితంలో గరళాన్ని మింగి.. తన గొంతులోని అమృతాన్ని మన చెవుల్లో పోసిన ఒక పల్లె కోయిల పాట…” అని సాగే ఈ పాటను బేబీతో పాడించారు రఘు కుంచె. ఆ పాటను యూట్యూబ్ లో ఉంచడంతో అదిప్పుడు దూసుకుపోతోంది. ప్రశాంతంగా పల్లెల్లో పాడే బేబీ మొదటిసారి రికార్డింగ్ థియేటర్ లో పాడే సమయంలో కొద్దిసేపు తడబడినా రఘు కుంచె ఇచ్చిన ధైర్యంతో చక్కగా పాడేసారు. మరోసారి తన గళంతో నెటిజన్స్ ను ఫిదా చేస్తున్నారు పసల బేబీ. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘పలాస 1978’ చిత్రంలో ఈ పాట ఉంటుంది. దీనికి లక్ష్మీ భూపాల లిరిక్స్ అందించాడు.

ఇటీవల దుబాయ్, మస్కట్ తదితర దేశాల్లో పర్యటించి వచ్చిన బేబీ, మంగళవారం నాడు హైదరాబాద్ చేరుకోగా, ఆ వెంటనే రఘు కుంచె ఈ పాటను రికార్డ్ చేశారట. నెట్టింట లక్షలాది వ్యూస్ తెచ్చుకుంటూ వైరల్ అవుతున్న బేబీ పాడిన పాటను మీరూ వినవచ్చు. ఇప్పటికే పలువరిని తన పాటతో ఫిదా చేసిన పసల బేబీ మెగాస్టార్ చిరంజీవి తనను ఇంటికి పిలిపించుకుని పాట పాడించుకున్నారు. అలాగే సీఎం చంద్రబాబు పసల బేబీని సన్మానించారు. ఇలా ప్రముఖుల దృష్టిలో పడిన ఆమెకు తొలిసారి ప్రముఖ గాయడకు,  సంగీత దర్శకుడు రఘు కుంచె పాడించిన పాటతో మరోసారి పసల బేడీ పాటను నెటిజన్స్ ఆస్వాదిస్తున్నారు.